Ninnadigidinadave neegemi gaaranamu

నిన్నడిగితినటవే నీకేమి గారణము
Language

(॥పల్లవి॥)
నిన్నడిగితినటవే నీకేమి గారణము
పన్ని యాతనికి నీకుఁ బనియేమే చెలియా

(॥నిన్న॥)
చెంది యాతఁడు చేసినసేఁతలు నేఁ దడవితే
అందాలు సేసి చెప్పే వవునే నీవు
యిందాఁకా నెందుంటివని ఇతని నే నడిగితే
అందే నిద్రించెనంటా నానలు వెట్టేవు

(॥నిన్న॥)
వొడ్డుకొఁగా మేనిమచ్చా లొరసి నేఁ జూచితేను
అడ్డాలు వచ్చేవు పతి కవునే నీవు
వొడ్డి యెవ్వతెపై వలపున్నది మతి నంటేను
యెడ్డవై నాకొప్పగించే వేమవుదువే నీవు

(॥నిన్న॥)
నిండుఁ గాఁగిటఁ గలసి నేఁజెమట రేఁచితేను
అండ నీవు విసరేవు అవునే నీవు
దండి యలమేల్మంగను తాను శ్రీవేంకటేశుఁడు
పండే వీమగనివొద్ద బాఁతైతివే నీవు

(||pallavi||)
ninnaḍigidinaḍave nīgemi gāraṇamu
panni yādanigi nīgum̐ baniyeme sĕliyā

(||ninna||)
sĕṁdi yādam̐ḍu sesinasem̐talu nem̐ daḍavide
aṁdālu sesi sĕppe vavune nīvu
yiṁdām̐kā nĕṁduṁṭivani idani ne naḍigide
aṁde nidriṁchĕnaṁṭā nānalu vĕṭṭevu

(||ninna||)
vŏḍḍugŏm̐gā menimachchā lŏrasi nem̐ jūsidenu
aḍḍālu vachchevu padi kavune nīvu
vŏḍḍi yĕvvadĕbai valabunnadi madi naṁṭenu
yĕḍḍavai nāgŏppagiṁche vemavuduve nīvu

(||ninna||)
niṁḍum̐ gām̐giḍam̐ galasi nem̐jĕmaḍa rem̐sidenu
aṁḍa nīvu visarevu avune nīvu
daṁḍi yalamelmaṁganu tānu śhrīveṁkaḍeśhum̐ḍu
paṁḍe vīmaganivŏdda bām̐taidive nīvu