నిన్నటికి నాయఁ బోయ నేఁడే లయ్య
(॥పల్లవి॥)
నిన్నటికి నాయఁ బోయ నేఁడే లయ్య
కన్నుల బీరాలే కాని కాంక్ష లేకుండ దయ్యా
(॥నిన్న॥)
వొట్టు వెట్టుకొనెఁ గాన వూర కున్నది చెలియ
వెట్టికి మాట లాడక వేఁడుకోవయ్య
పట్టినపంతమే కాని పై నున్నది ప్రేమ
వట్టియనువనా లేల వద్దికి రావయ్యా
(॥నిన్న॥)
పలుక దింతే కాని భార మెల్ల నీ మీఁదనే
చలి వాయఁ బై చేయి చాఁచవయ్య
చల మనేపేరు గాని సతి తమకము బెట్టు
కలికిచెక్కులు నొక్కి కాఁగిలించవయ్యా
(॥నిన్న॥)
సిగ్గులే మరఁగు గాని చింతలు వెలి కురికీ
యెగ్గు దీర మంచముపై కేఁగవయ్య
అగ్గమై శ్రీవెంకటేశ అంగనఁ గూడితి వింక
నిగ్గుల నాపెకోరికె నెరవేర్చవయ్యా
(||pallavi||)
ninnaḍigi nāyam̐ boya nem̐ḍe layya
kannula bīrāle kāni kāṁkṣha leguṁḍa dayyā
(||ninna||)
vŏṭṭu vĕṭṭugŏnĕm̐ gāna vūra kunnadi sĕliya
vĕṭṭigi māḍa lāḍaga vem̐ḍugovayya
paṭṭinabaṁtame kāni pai nunnadi prema
vaṭṭiyanuvanā lela vaddigi rāvayyā
(||ninna||)
paluga diṁte kāni bhāra mĕlla nī mīm̐dane
sali vāyam̐ bai seyi sām̐savayya
sala maneberu gāni sadi tamagamu bĕṭṭu
kaligisĕkkulu nŏkki kām̐giliṁchavayyā
(||ninna||)
siggule maram̐gu gāni siṁtalu vĕli kurigī
yĕggu dīra maṁchamubai kem̐gavayya
aggamai śhrīvĕṁkaḍeśha aṁganam̐ gūḍidi viṁka
niggula nābĕgorigĕ nĕraversavayyā