Ninnadige naanadeeve ne nee puttugulagu

నిన్నడిగే నానతీవే నే నీ పుట్టుగులకు
Language

(॥పల్లవి॥)
నిన్నడిగే నానతీవే నే నీ పుట్టుగులకు
పన్నుకొన్న నేరమి నాపై నెట్టు గలిగె

(॥నిన్న॥)
పూర్వపు నీవు పురాణపురుషుడవు గనక
వుర్విపై నీ వెఱుఁగని దొకటి లేదు
పర్విన కోటిసూర్యుప్రకాశుఁడవు గనక
సర్వజ్ఞ నీవు గానని చంద మేమీ లేదు

(॥నిన్న॥)
వినుతించ నీవు వేదవేద్యుఁడవు గనక
మనసులో నీ కెక్కడ మఱపు లేదు
అనిశము నీవు సర్వవ్యాపకుఁడవు గనక
యెనయఁగ నీకు విరహిత మెందూ లేదు

(॥నిన్న॥)
పొంత నీవు పంచమహాభూతేశుఁడవు గనక
పంతాన నీవు లేని ప్రపంచము లేదు
అంతర్యామివి శ్రీవేంకటాధిపతివి గనక
చింతాకంత నీవు లేని చేష్ట లేడా లేవు

(||pallavi||)
ninnaḍige nānadīve ne nī puṭṭugulagu
pannugŏnna nerami nābai nĕṭṭu galigĕ

(||ninna||)
pūrvabu nīvu purāṇaburuṣhuḍavu ganaga
vurvibai nī vĕṟum̐gani dŏgaḍi ledu
parvina koḍisūryupragāśhum̐ḍavu ganaga
sarvajña nīvu gānani saṁda memī ledu

(||ninna||)
vinudiṁcha nīvu vedavedyum̐ḍavu ganaga
manasulo nī kĕkkaḍa maṟabu ledu
aniśhamu nīvu sarvavyābagum̐ḍavu ganaga
yĕnayam̐ga nīgu virahida mĕṁdū ledu

(||ninna||)
pŏṁta nīvu paṁchamahābhūdeśhum̐ḍavu ganaga
paṁtāna nīvu leni prabaṁchamu ledu
aṁtaryāmivi śhrīveṁkaḍādhibadivi ganaga
siṁtāgaṁta nīvu leni seṣhṭa leḍā levu