నిన్నటి యలుక దేర్చీ నేఁడాతఁడే
(॥పల్లవి॥)
నిన్నటి యలుక దేర్చీ నేఁడాతఁడే
సన్నలకు చాయలకు సమ్మతించరాదా
(॥॥)
వలపులు చల్లఁగాను వాసులెంచ నేమిటికి
పిలువఁగఁ బతితోడ బిగియనేల
నెలకొని కొసరఁగ నెపము వేయనేఁటికి
కొలువు మొక్కులు మొక్కి కూచుండరాదా
(॥॥)
చెక్కులు నీకు నొక్కఁగ సిగ్గువడ నేమిటికి
మక్కువలు చూపఁగాను మచ్చరమేల
అక్కరతో మాటాడఁగా నానాలువెట్ట నేఁటికి
మొక్కలాన వీడెమిచ్చి మోము చూడరాదా
(॥॥)
పైకొని కాఁగిలించఁగా పంతములాడ నేఁటికి
నీకు లోనై యుండఁగాను నేరములేల
యీకడ శ్రీవేంకటేశుఁ డిరవై నిన్నిదే కూడె
యేకాలమును యిట్టే యెనయఁగరాదా
(||pallavi||)
ninnaḍi yaluga dersī nem̐ḍādam̐ḍe
sannalagu sāyalagu sammadiṁcharādā
(||||)
valabulu sallam̐gānu vāsulĕṁcha nemiḍigi
piluvam̐gam̐ badidoḍa bigiyanela
nĕlagŏni kŏsaram̐ga nĕbamu veyanem̐ṭigi
kŏluvu mŏkkulu mŏkki kūsuṁḍarādā
(||||)
sĕkkulu nīgu nŏkkam̐ga sigguvaḍa nemiḍigi
makkuvalu sūbam̐gānu machcharamela
akkarado māḍāḍam̐gā nānāluvĕṭṭa nem̐ṭigi
mŏkkalāna vīḍĕmichchi momu sūḍarādā
(||||)
paigŏni kām̐giliṁcham̐gā paṁtamulāḍa nem̐ṭigi
nīgu lonai yuṁḍam̐gānu neramulela
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiravai ninnide kūḍĕ
yegālamunu yiṭṭe yĕnayam̐garādā