Ninnadi suddulagumgaa nemdela tadavevu

నిన్నటి సుద్దులకుఁగా నేఁడేల తడవేవు
Language

(॥పల్లవి॥)
నిన్నటి సుద్దులకుఁగా నేఁడేల తడవేవు
కన్నుల నాతనిఁ జూచి కడు నవ్వఁగదవే

(॥నిన్న॥)
సారెకు నాడేనంటే జాణతనా లెన్నిలేవు
మేర మీర నెంతలేదు మేటిగర్వము
నేరములు వేసేనంటే నెపము లెన్ని లేవు
చేరి నీవిభుఁడు వీఁడె సేవ సేయఁ గదవే

(॥నిన్న॥)
వాసులే పెంచేనంటే వైపు లెన్నేసి లేవు
యీసు రేగేనంటే బింక మెంతలేదు
వేసాల సొలసేనంటే వేడుక లెంతలేదు
ఆసపడీ నిదే పతి అట్టె కూడఁగదవే

(॥నిన్న॥)
ఆతల సాదించేనంటే అట్టె చల మెంతలేదు
చేతుల నొడ్డించుకొంటే సిగ్గెంత లేదు
ఆతఁడు శ్రీవెంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
యేతుల నిన్నిదె కూడె నిఁక మెచ్చఁగదవే

(||pallavi||)
ninnaḍi suddulagum̐gā nem̐ḍela taḍavevu
kannula nādanim̐ jūsi kaḍu navvam̐gadave

(||ninna||)
sārĕgu nāḍenaṁṭe jāṇadanā lĕnnilevu
mera mīra nĕṁtaledu meḍigarvamu
neramulu vesenaṁṭe nĕbamu lĕnni levu
seri nīvibhum̐ḍu vīm̐ḍĕ seva seyam̐ gadave

(||ninna||)
vāsule pĕṁchenaṁṭe vaibu lĕnnesi levu
yīsu regenaṁṭe biṁka mĕṁtaledu
vesāla sŏlasenaṁṭe veḍuga lĕṁtaledu
āsabaḍī nide padi aṭṭĕ kūḍam̐gadave

(||ninna||)
ādala sādiṁchenaṁṭe aṭṭĕ sala mĕṁtaledu
sedula nŏḍḍiṁchugŏṁṭe siggĕṁta ledu
ādam̐ḍu śhrīvĕṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavu nīvu
yedula ninnidĕ kūḍĕ nim̐ka mĕchcham̐gadave