Ninnadi pamtaalagu nemdemtige

నిన్నటి పంతాలకు నేఁడేఁటికే
Language

(॥పల్లవి॥)
నిన్నటి పంతాలకు నేఁడేఁటికే
మన్ననలు చేకొనుటే మంచిదివో చెలియా

(॥॥)
వొడివట్టి తియ్యఁగాను వోపనననేఁటికే
బడిబడి దిరుఁగఁగాఁ బాయ నేఁటికే
అడియాలా లొసఁగఁగా నానవెట్టనేఁటికే
వొడఁబాటు సేసుకొను టుచిత మే వనిత

(॥॥)
సెలవుల నవ్వఁ గాను సిగ్గులింకానేఁటికే
మలసి పెనఁగఁగాను మంకులేటికే
వలపులు చల్లఁ గాను వాసు లింతయేఁటికే
కలపుకోలుదనమె కందువ వోమగునా

(॥॥)
కాఁగలించుకొనఁగాను కడపఁగనేఁటికే
మాఁగినమో వియ్యఁగాను మఱఁగేఁటికే
చేఁగదేరఁ గూడె నిదె శ్రీవేంకటేశ్వరుఁడు
వీఁగనిరతులఁ గడువెలయవే సకియ

(||pallavi||)
ninnaḍi paṁtālagu nem̐ḍem̐ṭige
mannanalu segŏnuḍe maṁchidivo sĕliyā

(||||)
vŏḍivaṭṭi tiyyam̐gānu vobanananem̐ṭige
baḍibaḍi dirum̐gam̐gām̐ bāya nem̐ṭige
aḍiyālā lŏsam̐gam̐gā nānavĕṭṭanem̐ṭige
vŏḍam̐bāḍu sesugŏnu ṭusida me vanida

(||||)
sĕlavula navvam̐ gānu sigguliṁkānem̐ṭige
malasi pĕnam̐gam̐gānu maṁkuleḍige
valabulu sallam̐ gānu vāsu liṁtayem̐ṭige
kalabugoludanamĕ kaṁduva vomagunā

(||||)
kām̐galiṁchugŏnam̐gānu kaḍabam̐ganem̐ṭige
mām̐ginamo viyyam̐gānu maṟam̐gem̐ṭige
sem̐gaderam̐ gūḍĕ nidĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
vīm̐ganiradulam̐ gaḍuvĕlayave sagiya