నిన్నాతఁడు మన్నించఁగా నేను వలదంటినా
(॥పల్లవి॥)
నిన్నాతఁడు మన్నించఁగా నేను వలదంటినా
సన్నల చాయల నీవు సాదించరాదా
(॥నిన్నా॥)
మేలిమిసోమ్ములు నాకు మించి యాతఁ డిచ్చెనంటా
యీలాగుల నందరితో నేమిచెప్పేవే
చాలుకోని నాతోనే సరసమాడీనంటా
కొలుముందుగానేల గుబ్బతిలేవే
(॥నిన్నా॥)
పలుమారు నాతఁడు నాపై బత్తి సేసెనంటా
చెలగి నన్నేంత దిష్టంచి చూచేవే
పిలిచి నాపై నతఁడు ప్రియములు చల్లెనంటా
వెలయ మోమెఁత వెలవెలఁ జేసుకొనేవే
(॥నిన్నా॥)
అక్కరై శ్రీవేంకటేశుఁ డాసతో నన్నేలెవంటా
చెక్కుచెమటతోనేల సిగ్గువడేవే
యిక్కడనే నిన్నునేలె యే నలమేలుమంగను
యిక్కువ నన్నంటెనంటా నెంత యేఁకరేపే
(||pallavi||)
ninnādam̐ḍu manniṁcham̐gā nenu valadaṁṭinā
sannala sāyala nīvu sādiṁcharādā
(||ninnā||)
melimisommulu nāgu miṁchi yādam̐ ḍichchĕnaṁṭā
yīlāgula naṁdarido nemisĕppeve
sālugoni nādone sarasamāḍīnaṁṭā
kŏlumuṁdugānela gubbadileve
(||ninnā||)
palumāru nādam̐ḍu nābai batti sesĕnaṁṭā
sĕlagi nanneṁta diṣhṭaṁchi sūseve
pilisi nābai nadam̐ḍu priyamulu sallĕnaṁṭā
vĕlaya momĕm̐ta vĕlavĕlam̐ jesugŏneve
(||ninnā||)
akkarai śhrīveṁkaḍeśhum̐ ḍāsado nannelĕvaṁṭā
sĕkkusĕmaḍadonela sigguvaḍeve
yikkaḍane ninnunelĕ ye nalamelumaṁganu
yikkuva nannaṁṭĕnaṁṭā nĕṁta yem̐karebe