Ninnaa monnaa leni tami nede vachchenaa

నిన్నా మొన్నా లేని తమి నేడే వచ్చెనా
Language

(॥పల్లవి॥)
నిన్నా మొన్నా లేని తమి నేడే వచ్చెనా
పమ్మి(న్ని?) మమ్మేఁటికి నింత పరచేవో కాని

(॥నిన్నా॥)
సంగడి గూచుండి నన్ను సారె సారెఁ జెక్కు నొక్కి
యెంగిలి మో వడిగేవు యేరా నీవు
అంగనలు లేక కాదు అంతేసి మోహముగాన
చెంగట మమ్మేల కాకు సేసేవో కాని

(॥నిన్నా॥)
చక్కదనాలు వొగడి సరసపు మాటలాడి
యిక్కువకు జేయి చాఁచే వేరా నీవు
అక్కరౌతాఁ దెలియదు అణకించే దెరఁగము
వొక్కమాటే మమ్మింతేల వొరసేవో కాని

(॥నిన్నా॥)
నమ్మికలు నాకు నిచ్చి నయగారా లెల్లా జేసి
యిమ్ముల గాగిఁటఁ గూడి తేరా నీవు
నెమ్మది శ్రీవేంకటేశ నీవెంత నే నెంత
ముమ్మాటికి నింకా నేల మొక్కేవో కాని

(||pallavi||)
ninnā mŏnnā leni tami neḍe vachchĕnā
pammi(nni?) mammem̐ṭigi niṁta parasevo kāni

(||ninnā||)
saṁgaḍi gūsuṁḍi nannu sārĕ sārĕm̐ jĕkku nŏkki
yĕṁgili mo vaḍigevu yerā nīvu
aṁganalu lega kādu aṁtesi mohamugāna
sĕṁgaḍa mammela kāgu sesevo kāni

(||ninnā||)
sakkadanālu vŏgaḍi sarasabu māḍalāḍi
yikkuvagu jeyi sām̐se verā nīvu
akkaraudām̐ dĕliyadu aṇagiṁche dĕram̐gamu
vŏkkamāḍe mammiṁtela vŏrasevo kāni

(||ninnā||)
nammigalu nāgu nichchi nayagārā lĕllā jesi
yimmula gāgim̐ṭam̐ gūḍi terā nīvu
nĕmmadi śhrīveṁkaḍeśha nīvĕṁta ne nĕṁta
mummāḍigi niṁkā nela mŏkkevo kāni