నిన్న మాపే తనకు నేను లోననరే
(॥పల్లవి॥)
నిన్న మాపే తనకు నేను లోననరే
యెన్ని చేసినాఁ జేసె ఇఁకనేలే వెఱపు
(॥నిన్న॥)
పొలఁతు లిందరు దను పోది సేసి పొగడఁగా
అలయుచు నే వెంగేలాడే దాననా
పలుమారు వద్దివారు బత్తులు సేయఁగాను
నెలఁత నే నొక్కతెనే నిష్ఠూరినా
(॥నిన్న॥)
ఇంటికాడిసతులెల్లా యిచ్చకము సేయఁగాను
జంటనుండి నేనే కడుఁ జెండి పోరేనా
వెంటనే చుట్టరికాలు వీరెల్లాఁ జెప్పఁగాను
గొంటరితనాన నేను గొరబుసేసేనా
(॥నిన్న॥)
సేనవెట్టినవారెల్లా చేకొని పంతాలియ్యఁగా
యీసున నేనే యెలయించే దాననా
ఆసల శ్రీవేంకటేశుఁ డట్టె తా నన్నుఁగలసె
పోసరించి తనకు నే బుద్ది చెప్పేదాననా
(||pallavi||)
ninna mābe tanagu nenu lonanare
yĕnni sesinām̐ jesĕ im̐kanele vĕṟabu
(||ninna||)
pŏlam̐tu liṁdaru danu podi sesi pŏgaḍam̐gā
alayusu ne vĕṁgelāḍe dānanā
palumāru vaddivāru battulu seyam̐gānu
nĕlam̐ta ne nŏkkadĕne niṣhṭhūrinā
(||ninna||)
iṁṭigāḍisadulĕllā yichchagamu seyam̐gānu
jaṁṭanuṁḍi nene kaḍum̐ jĕṁḍi porenā
vĕṁṭane suṭṭarigālu vīrĕllām̐ jĕppam̐gānu
gŏṁṭaridanāna nenu gŏrabusesenā
(||ninna||)
senavĕṭṭinavārĕllā segŏni paṁtāliyyam̐gā
yīsuna nene yĕlayiṁche dānanā
āsala śhrīveṁkaḍeśhum̐ ḍaṭṭĕ tā nannum̐galasĕ
posariṁchi tanagu ne buddi sĕppedānanā