నిమ్మలాన వెరవక నీ వాపెతో మాటలాడు
(॥పల్లవి॥)
నిమ్మలాన వెరవక నీ వాపెతో మాటలాడు
కమ్మి నన్నేమి చూచేవు కపటము నేర్తునా
(॥నిమ్మ॥)
నీకు వలచి వచ్చిననెరజాణసతులతో
వాకు దెరచి నే నింకా వాదడిచేనా
యీకడ నిచ్చక మాడి యేల నన్నుఁ బొదిగేవు
యీ కొలఁది నే నంత యెరఁగనికూళనా
(॥నిమ్మ॥)
సరసము నీతో నాడే చనవరిసతులతో
కొరకొర వెట్టుకొని కోపగించేనా
యిరవైనసొమ్ము లిచ్చి యెంత నన్ను మన్నించేవు
ధరలోన నే తగవు దుప్పేటిదాననా
(॥నిమ్మ॥)
యిక్కువ నీకాఁగిటిలో నిటువంటివనితల
పక్కన నాచేతఁ బట్టి పాయ దీసేనా
మొక్కుచు శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
తొక్కుమెట్టు కోరువని దోకారిదాననా
(||pallavi||)
nimmalāna vĕravaga nī vābĕdo māḍalāḍu
kammi nannemi sūsevu kabaḍamu nerdunā
(||nimma||)
nīgu valasi vachchinanĕrajāṇasadulado
vāgu dĕrasi ne niṁkā vādaḍisenā
yīgaḍa nichchaga māḍi yela nannum̐ bŏdigevu
yī kŏlam̐di ne naṁta yĕram̐ganigūḽanā
(||nimma||)
sarasamu nīdo nāḍe sanavarisadulado
kŏragŏra vĕṭṭugŏni kobagiṁchenā
yiravainasŏmmu lichchi yĕṁta nannu manniṁchevu
dharalona ne tagavu duppeḍidānanā
(||nimma||)
yikkuva nīgām̐giḍilo niḍuvaṁṭivanidala
pakkana nāsedam̐ baṭṭi pāya dīsenā
mŏkkusu śhrī veṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi
tŏkkumĕṭṭu koruvani dogāridānanā