Nimishamum baayaleraa ninnedasi yogasoda

నిమిషముఁ బాయలేరా నిన్నెడసి యొకచోట
Language

(॥పల్లవి॥)
నిమిషముఁ బాయలేరా నిన్నెడసి యొకచోట
తమకమేకాని నా ధైర్యమేఁటిదిరా

(॥నిమి॥)
వాకిటి కంపించుకొని వత్తుఁగాని నీచేత
ఆకడ మగుడ నీయండకు రాకుండలేరా
కైకొని తప్పక చూచి కనురెప్ప వేతుఁగాని
జోకలఁ గమ్మర నిన్నుఁజూడకుండలేనురా

(॥నిమి॥)
మాటలాడి నీతోను మానినట్టే వుందుఁగాని
పాటించి అంతటిలోనే పలుకక వుండలేరా
పాటిసిగ్గునను నాపయ్యదఁ గప్పుదుఁ గాని
వూటచమట నాచన్నుల నొత్తకుండలేనురా

(॥నిమి॥)
మంతనపు నీరతుల మనసు చొక్కుదుఁగాని
అంతలోఁ దెలిసి మరి యాసపడకుండలేరా
అంతట శ్రీవేంకటేశ అదెఱింగి కూడితివి
చింతలో నీమేలు నేను చింతించకుండలేరా

(||pallavi||)
nimiṣhamum̐ bāyalerā ninnĕḍasi yŏgasoḍa
tamagamegāni nā dhairyamem̐ṭidirā

(||nimi||)
vāgiḍi kaṁpiṁchugŏni vattum̐gāni nīseda
āgaḍa maguḍa nīyaṁḍagu rāguṁḍalerā
kaigŏni tappaga sūsi kanurĕppa vedum̐gāni
jogalam̐ gammara ninnum̐jūḍaguṁḍalenurā

(||nimi||)
māḍalāḍi nīdonu māninaṭṭe vuṁdum̐gāni
pāḍiṁchi aṁtaḍilone palugaga vuṁḍalerā
pāḍisiggunanu nābayyadam̐ gappudum̐ gāni
vūḍasamaḍa nāsannula nŏttaguṁḍalenurā

(||nimi||)
maṁtanabu nīradula manasu sŏkkudum̐gāni
aṁtalom̐ dĕlisi mari yāsabaḍaguṁḍalerā
aṁtaḍa śhrīveṁkaḍeśha adĕṟiṁgi kūḍidivi
siṁtalo nīmelu nenu siṁtiṁchaguṁḍalerā