Nimduvedugaladoda nemmadi numdudamgaaga

నిండువేడుకలతోడ నెమ్మది నుండుటఁగాక
Language

(॥పల్లవి॥)
నిండువేడుకలతోడ నెమ్మది నుండుటఁగాక
పండువెన్నెలలోన బయలీఁదనేఁటికి

(॥నిండు॥)
మొగమోటే కలిగితే మంచి పదరనీయదు
నగితేఁ జుట్టురికము నాఁటుకొనును
తగిలితే మనసే తఱవుకాఁడై మించు
మగనికి నాలికిని మఱి చింత యేఁటికి

(॥నిండు॥)
తలకొన్న నేస్తాలే తమకము పెడరేఁచు
పిలుపు లొనగూడితేఁ బ్రియాలు వుట్టు
తొలసినజవ్వనమే పొంతనాలై కలయించు
చెలియకుఁబతికిని సిగ్గుపడనేఁటికి

(॥నిండు॥)
ఆసలు నెలకొంటేను అందించుఁ గాఁగిటిరతి
వేసరక పొదిగితే వెలయుబత్తి
సేసవెట్టి నిన్నునేలె శ్రీవేంకటేశ్వరుఁడు
బాస లాతనికి నీకుఁ బచారించనేఁటికి

(||pallavi||)
niṁḍuveḍugaladoḍa nĕmmadi nuṁḍuḍam̐gāga
paṁḍuvĕnnĕlalona bayalīm̐danem̐ṭigi

(||niṁḍu||)
mŏgamoḍe kaligide maṁchi padaranīyadu
nagidem̐ juṭṭurigamu nām̐ṭugŏnunu
tagilide manase taṟavugām̐ḍai miṁchu
maganigi nāligini maṟi siṁta yem̐ṭigi

(||niṁḍu||)
talagŏnna nestāle tamagamu pĕḍarem̐su
pilubu lŏnagūḍidem̐ briyālu vuṭṭu
tŏlasinajavvaname pŏṁtanālai kalayiṁchu
sĕliyagum̐badigini siggubaḍanem̐ṭigi

(||niṁḍu||)
āsalu nĕlagŏṁṭenu aṁdiṁchum̐ gām̐giḍiradi
vesaraga pŏdigide vĕlayubatti
sesavĕṭṭi ninnunelĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
bāsa lādanigi nīgum̐ basāriṁchanem̐ṭigi