Nimdunidhaanamuvale neegum galige

నిండునిధానమువలె నీకుఁ గలిగె
Language

(॥పల్లవి॥)
నిండునిధానమువలె నీకుఁ గలిగె
అండనే భాగ్యవంతుఁడ వౌదువయ్యా నీవు

(॥నిండు॥)
వీడెమిచ్చుతరినే విన్నపాలెల్లాఁ జేసె
వూళిగపువేళనే వొడఁబరచె
వేడుకతో నవ్వుతానే వేలువెట్టి యిమ్ముగొనె
యేడఁ దెచ్చుకొంటివి ఇటువంటిసతిని

(॥నిండు॥)
పన్నిపాదాలోత్తుతానే బాసలు సేయించుకొనె
చన్నులు చూపిచూపి చనవరాయ
వెన్నెలగలనాఁడే కావించె నలునేరేళ్లు
యిన్నేసి కతలకారి యెట్టు నీకు దొరకె

(॥నిండు॥)
సేలు చల్లుతానే చెలఁగి నీమోవి యానె
లాసిలాసి కూడె నీయలమేలుమంగ
వాసితో శ్రీవేంకటేశ వలపు వర్తనగొనె
యీసరి నన్నేలితివి యీకె నీకు నబ్బెను

(||pallavi||)
niṁḍunidhānamuvalĕ nīgum̐ galigĕ
aṁḍane bhāgyavaṁtum̐ḍa vauduvayyā nīvu

(||niṁḍu||)
vīḍĕmichchudarine vinnabālĕllām̐ jesĕ
vūḽigabuveḽane vŏḍam̐barasĕ
veḍugado navvudāne veluvĕṭṭi yimmugŏnĕ
yeḍam̐ dĕchchugŏṁṭivi iḍuvaṁṭisadini

(||niṁḍu||)
pannibādālottudāne bāsalu seyiṁchugŏnĕ
sannulu sūbisūbi sanavarāya
vĕnnĕlagalanām̐ḍe kāviṁchĕ nalunereḽlu
yinnesi kadalagāri yĕṭṭu nīgu dŏragĕ

(||niṁḍu||)
selu salludāne sĕlam̐gi nīmovi yānĕ
lāsilāsi kūḍĕ nīyalamelumaṁga
vāsido śhrīveṁkaḍeśha valabu vardanagŏnĕ
yīsari nannelidivi yīgĕ nīgu nabbĕnu