Nimdum baayamum gaayamu nee sommu

నిండుఁ బాయముఁ గాయము నీ సొమ్ము
Language

(॥పల్లవి॥)
నిండుఁ బాయముఁ గాయము నీ సొమ్ము
కొండలరాయఁడ నీవే గురి యింతే కాక

(॥నిండు॥)
పంతము నీతోడ నేఁ బలికేనా ఆఁటదాన
చెంతఁబుణ్యపాపము నీచేతి దేకాక
యింతగా వలపించితి వెడమాఁట లిఁకనేల
కంతు గురుఁడవు నీవే కనుఁగొంట గాక

(॥నిండు॥)
చూపుల నిన్నింకా నే సొలసేనా యింటిదాన
తోపు నూకుడెల్లా నీకే దోసముగాక
తీపులఁబెట్టితి నీవే తిరుగనాడఁగనేల
శ్రీ పతి విన్నిటాను నీచిత్త మింతేకాక

(॥నిండు॥)
కాఁగిట నిన్నింకా నేఁ గాదనేనా మేనదాన
చేఁగయుఁ జిగురు నీకే సెలవుగాక
వీఁగక కూడితివి శ్రీ వేంకటేశ యిటు నన్ను
పాఁగినపతివి నీకే ఫల మింతేకాక

(||pallavi||)
niṁḍum̐ bāyamum̐ gāyamu nī sŏmmu
kŏṁḍalarāyam̐ḍa nīve guri yiṁte kāga

(||niṁḍu||)
paṁtamu nīdoḍa nem̐ baligenā ām̐ṭadāna
sĕṁtam̐buṇyabābamu nīsedi degāga
yiṁtagā valabiṁchidi vĕḍamām̐ṭa lim̐kanela
kaṁtu gurum̐ḍavu nīve kanum̐gŏṁṭa gāga

(||niṁḍu||)
sūbula ninniṁkā ne sŏlasenā yiṁṭidāna
tobu nūguḍĕllā nīge dosamugāga
tībulam̐bĕṭṭidi nīve tiruganāḍam̐ganela
śhrī padi vinniḍānu nīsitta miṁtegāga

(||niṁḍu||)
kām̐giḍa ninniṁkā nem̐ gādanenā menadāna
sem̐gayum̐ jiguru nīge sĕlavugāga
vīm̐gaga kūḍidivi śhrī veṁkaḍeśha yiḍu nannu
pām̐ginabadivi nīge phala miṁtegāga