(॥పల్లవి॥)
నిండుకున్నది వలపు నీమీఁద
పండివున్నవి ఆసలు పైపై నామీఁదను
(॥నిండు॥)
చెక్కులు నీవు నొక్కఁగ చింతలన్నియునుఁ బాసె
మొక్కులు నే మొక్కఁగాను మోహము నిండె
ఇక్కువలు గరఁగితి మిద్దరము నిందువంక
తక్కిని మాటలేమియుఁ దడవకు మిఁకను
(॥నిండు॥)
చేయి నీవు వేయఁగాను చెమరించె దేహమెల్ల
చాయల నేఁజూడఁగాను చవివుట్టెను
పాయపు వేడుక లబ్బెపలుమారు నిందువంక
పోయిన సుద్దులు వోనీ బొంకకుమీ ఇఁకను
(॥నిండు॥)
చెనకి నీవు గూడఁగ సిగ్గులు పొత్తుకు వచ్చె
తనిసి నే మెచ్చఁగాను తమివుట్టెను
యెనసితిమి శ్రీవేంకటేశుఁడ నేఁడిందువంక
చనవులెల్ల నీడేరె సాదించకు మిఁకను
(||pallavi||)
niṁḍugunnadi valabu nīmīm̐da
paṁḍivunnavi āsalu paibai nāmīm̐danu
(||niṁḍu||)
sĕkkulu nīvu nŏkkam̐ga siṁtalanniyunum̐ bāsĕ
mŏkkulu ne mŏkkam̐gānu mohamu niṁḍĕ
ikkuvalu garam̐gidi middaramu niṁduvaṁka
takkini māḍalemiyum̐ daḍavagu mim̐kanu
(||niṁḍu||)
seyi nīvu veyam̐gānu sĕmariṁchĕ dehamĕlla
sāyala nem̐jūḍam̐gānu savivuṭṭĕnu
pāyabu veḍuga labbĕbalumāru niṁduvaṁka
poyina suddulu vonī bŏṁkagumī im̐kanu
(||niṁḍu||)
sĕnagi nīvu gūḍam̐ga siggulu pŏttugu vachchĕ
tanisi ne mĕchcham̐gānu tamivuṭṭĕnu
yĕnasidimi śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ḍiṁduvaṁka
sanavulĕlla nīḍerĕ sādiṁchagu mim̐kanu