నిండుకొని యుండినదే నేరుపుగాక
(॥పల్లవి॥)
నిండుకొని యుండినదే నేరుపుగాక
కొండుక పాయపువానిఁ గోపగించవలెనా
(॥నిండు॥)
యేదో సతులతో నీ వేలాటాలాడితివంటా
ఆడరాని మాటలు నే నాడవచ్చునా
వేడుకకానికి మరి వివరించ నేడ పాటి
చూడ నందుకు దోడు నిష్ఠురము గావలెనా
(॥నిండు॥)
చాయలఁ బొరుగాపెకు సన్నలు చేసితివంటా
చేయరాని సేఁతలు నేఁ జేయవచ్చునా
దాయగాఁడైనవానికి దాక్షిణ్యమేమున్నది
రాయడి నిదీఁ గొంత రవ్వ సేయవలెనా
(॥నిండు॥)
యెవ్వతెకైనా నీవు యిచ్చకముసేతువంటా
నవ్వరాని నవ్వులు నే నవ్వవచ్చునా
యివ్వల శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
అవ్వల నింకా రతి నలయించవలెనా
(||pallavi||)
niṁḍugŏni yuṁḍinade nerubugāga
kŏṁḍuga pāyabuvānim̐ gobagiṁchavalĕnā
(||niṁḍu||)
yedo sadulado nī velāḍālāḍidivaṁṭā
āḍarāni māḍalu ne nāḍavachchunā
veḍugagānigi mari vivariṁcha neḍa pāḍi
sūḍa naṁdugu doḍu niṣhṭhuramu gāvalĕnā
(||niṁḍu||)
sāyalam̐ bŏrugābĕgu sannalu sesidivaṁṭā
seyarāni sem̐talu nem̐ jeyavachchunā
dāyagām̐ḍainavānigi dākṣhiṇyamemunnadi
rāyaḍi nidīm̐ gŏṁta ravva seyavalĕnā
(||niṁḍu||)
yĕvvadĕgainā nīvu yichchagamuseduvaṁṭā
navvarāni navvulu ne navvavachchunā
yivvala śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
avvala niṁkā radi nalayiṁchavalĕnā