నిండుదొరవౌదువు నీ జాణతనము మేలు
(॥పల్లవి॥)
నిండుదొరవౌదువు నీ జాణతనము మేలు
అండనే నవ్వఁగ వద్దా అన్నిటా నాతోను
(॥॥)
వుద్దండాలు సేసి పచ్చి వొగిఁ జుట్టమవై నీవు
సుద్దులెల్లఁ జెప్పవద్దా సూటిగా నాకు
పెద్దరికాలకు వెంటఁ బెట్టుక ఆపెనుఁ దెచ్చి
గద్దించవద్దా నీవు కమ్మటి నాచెలుల
(॥॥)
కొత్తరేకలు నించుక గుణవంతుని వలెనే
బత్తులెల్లాఁ జేయవద్దా పైపై నాకు
హత్తిన తరితీపుల నాపెసొమ్ము మేనఁబెట్టి
పొత్తునఁ గూచుండవద్దా పూని వచ్చి ఇపుడు
(॥॥)
రతులఁ దనిసి వచ్చి హితవరివలెనే
తతిఁ బెడరేఁచవద్దా తమి నాకును
క్షితిఁ బరమపదేశ శ్రీవేంకటేశుఁడవై
సతమై కూడఁగవద్దా సారెనిట్టే నన్నును
(||pallavi||)
niṁḍudŏravauduvu nī jāṇadanamu melu
aṁḍane navvam̐ga vaddā anniḍā nādonu
(||||)
vuddaṁḍālu sesi pachchi vŏgim̐ juṭṭamavai nīvu
suddulĕllam̐ jĕppavaddā sūḍigā nāgu
pĕddarigālagu vĕṁṭam̐ bĕṭṭuga ābĕnum̐ dĕchchi
gaddiṁchavaddā nīvu kammaḍi nāsĕlula
(||||)
kŏttaregalu niṁchuga guṇavaṁtuni valĕne
battulĕllām̐ jeyavaddā paibai nāgu
hattina taridībula nābĕsŏmmu menam̐bĕṭṭi
pŏttunam̐ gūsuṁḍavaddā pūni vachchi ibuḍu
(||||)
radulam̐ danisi vachchi hidavarivalĕne
tadim̐ bĕḍarem̐savaddā tami nāgunu
kṣhidim̐ baramabadeśha śhrīveṁkaḍeśhum̐ḍavai
sadamai kūḍam̐gavaddā sārĕniṭṭe nannunu