నిండు వలపులతోడ నిన్ను నీ వెఱఁగవు
(॥పల్లవి॥)
నిండు వలపులతోడ నిన్ను నీ వెఱఁగవు
పండవే యాతని పక్క బాగాలిచ్చేవుగాని
(॥నిండు॥)
చినుకుఁజిత్తడియైన చెమట దుడుచుకోవే
వెనక నాతనితో నవ్వేవుగాని
కొనలు వెళ్లి వీడిన కొప్పు చక్కఁబెట్టుకోవే
మునుకొని తలవంచి మొక్కుదువుగాని
(॥నిండు॥)
బలు చన్నులపై జారే పయ్యద గప్పుకొనవే
సొలసి యాతని దిక్కు చూతువుగాని
పెలుచుఁ గెమ్మోవిమీఁదిబేంట్లు మూసుకోవే
అలరి యాతనితో మాఁటలాడుదువుగాని
(॥నిండు॥)
నెట్టన రెప్పల తుద నిద్దుర లడంచుకోవే
గుట్టున నీతని మరిఁ గూడేవుగాని
యిట్టె శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నేఁడు
చుట్టరికము చెప్పవే చొక్కింతువుగాని
(||pallavi||)
niṁḍu valabuladoḍa ninnu nī vĕṟam̐gavu
paṁḍave yādani pakka bāgālichchevugāni
(||niṁḍu||)
sinugum̐jittaḍiyaina sĕmaḍa duḍusugove
vĕnaga nādanido navvevugāni
kŏnalu vĕḽli vīḍina kŏppu sakkam̐bĕṭṭugove
munugŏni talavaṁchi mŏkkuduvugāni
(||niṁḍu||)
balu sannulabai jāre payyada gappugŏnave
sŏlasi yādani dikku sūduvugāni
pĕlusum̐ gĕmmovimīm̐dibeṁṭlu mūsugove
alari yādanido mām̐ṭalāḍuduvugāni
(||niṁḍu||)
nĕṭṭana rĕppala tuda niddura laḍaṁchugove
guṭṭuna nīdani marim̐ gūḍevugāni
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu nannu nem̐ḍu
suṭṭarigamu sĕppave sŏkkiṁtuvugāni