Nimdu sobanamulaaya nee vuttara shreeramgesha

నిండు సోబనములాయ నీ వుత్తర శ్రీరంగేశ
Language

(॥పల్లవి॥)
నిండు సోబనములాయ నీ వుత్తర శ్రీరంగేశ
మెండాయను వలపులు మెలుఁతలకెల్లాను

(॥నిండు॥)
ముంచి నీవు మాఁటలాడే మోవిపై తెనెలనే
కంచుము పొత్తు గలసె కాంతలకెల్లా
పొంచి నీవు చూచే చూపుల ముంగిటి ముగ్గులనే
పంచల పండుగలాయ భామలకెల్లాను

(॥నిండు॥)
చిత్తగించి నవ్వు నవ్వే సెలవిముత్తేలనే
కొత్త కొత్త సేప లాయ కొమ్మలకెల్లా
తత్తరపు కొనగోరితాఁకుల వజ్రాలనే
హత్తుక వుంకువలాయ నంగనలకెల్లాను

(॥నిండు॥)
గరిమ మనసు కోరికల చిగిరంపులవే
సరిఁ బెండ్లి విడేలాయ సతులకెల్లా
నిరతి శ్రీవేంకటేశ నీ రతుల వేడుకలు
విరుల వసంతాలాయ వెలఁదుల కెల్లాను

(||pallavi||)
niṁḍu sobanamulāya nī vuttara śhrīraṁgeśha
mĕṁḍāyanu valabulu mĕlum̐talagĕllānu

(||niṁḍu||)
muṁchi nīvu mām̐ṭalāḍe movibai tĕnĕlane
kaṁchumu pŏttu galasĕ kāṁtalagĕllā
pŏṁchi nīvu sūse sūbula muṁgiḍi muggulane
paṁchala paṁḍugalāya bhāmalagĕllānu

(||niṁḍu||)
sittagiṁchi navvu navve sĕlavimuttelane
kŏtta kŏtta seba lāya kŏmmalagĕllā
tattarabu kŏnagoridām̐kula vajrālane
hattuga vuṁkuvalāya naṁganalagĕllānu

(||niṁḍu||)
garima manasu korigala sigiraṁpulave
sarim̐ bĕṁḍli viḍelāya sadulagĕllā
niradi śhrīveṁkaḍeśha nī radula veḍugalu
virula vasaṁtālāya vĕlam̐dula kĕllānu