నిండు నా పాయము నేఁడు నా చేతిది
(॥పల్లవి॥)
నిండు నా పాయము నేఁడు నా చేతిది
గుండెలో నీ యాసలైతే కోటానఁగోట్లు
(॥నిండు॥)
తనివోదు నిన్ను మతిఁదలపోసినా నాకు
మనసు లోపలికాంక్ష మఱి యెట్టిదో
మొనసి నవ్విన ముచ్చటలు దీరవు
పెనఁగేటి సంతపుఁ బ్రేమ యెట్టిదో
(॥నిండు॥)
కన్నులలో తమి వోదు కదిసి తప్పక చూచి
ఇన్నిటా నాతరితీపు లెటువంటివో
యెన్నిమాఁట లాడినాను యేఁకటలు వాయవు
సన్నల నాలుకమీఁదిచవు లిఁక నెట్టివో
(॥నిండు॥)
కాయముపై కసి వోదు కాఁగిట బిగించినాను
చాయల సన్నల సాహసము లెట్టివో
యీయెడ శ్రీవేంకటేశ యీడేర నన్నుఁ గూడితి
మాయని మనలోపలి మాటప ట్లెట్టివో
(||pallavi||)
niṁḍu nā pāyamu nem̐ḍu nā sedidi
guṁḍĕlo nī yāsalaide koḍānam̐goṭlu
(||niṁḍu||)
tanivodu ninnu madim̐dalabosinā nāgu
manasu lobaligāṁkṣha maṟi yĕṭṭido
mŏnasi navvina muchchaḍalu dīravu
pĕnam̐geḍi saṁtabum̐ brema yĕṭṭido
(||niṁḍu||)
kannulalo tami vodu kadisi tappaga sūsi
inniḍā nādaridību lĕḍuvaṁṭivo
yĕnnimām̐ṭa lāḍinānu yem̐kaḍalu vāyavu
sannala nālugamīm̐disavu lim̐ka nĕṭṭivo
(||niṁḍu||)
kāyamubai kasi vodu kām̐giḍa bigiṁchinānu
sāyala sannala sāhasamu lĕṭṭivo
yīyĕḍa śhrīveṁkaḍeśha yīḍera nannum̐ gūḍidi
māyani manalobali māḍaba ṭlĕṭṭivo