Nimdu damagamudoda nee ramani

నిండు దమకముతోడ నీ రమణి
Language

(॥పల్లవి॥)
నిండు దమకముతోడ నీ రమణి
అండ నిన్నుఁ బచ్చిదోఁచ నాడునో యేమో

(॥నిండు॥)
ఆల నెదురు చూచి యంగనలఁ బెట్టి పంపె
నీసముకాన కిదివో నీరమణి
మోసపోక నీమాఁట ముదులకించి రమ్మనె
వాసితో తానే యీడకు వచ్చునో యేమో

(॥నిండు॥)
చిత్తములోఁజింతించి చేత నన్ను యీగురుతు
హత్తి నీ కిమ్మనె నీ మోహపుదేవి
మొత్తమునఁ జేయెత్తిమొక్కి నీకు రమ్మనె
వొత్తి మామూఁకలో వచ్చి వున్నదో యేమో

(॥నిండు॥)
కమ్మి తననీరూపులకాకతపుసుర టిదే
పమ్మి నీకుఁ బుత్తెంచె నీప్రాణేశ్వరి
చిమ్మేవు పెంజెమటలు శ్రీ వేంకటేశుఁడ నీవు
దొమ్మి నీవుర మెక్కినతొయ్యలే ఆపేమో

(||pallavi||)
niṁḍu damagamudoḍa nī ramaṇi
aṁḍa ninnum̐ bachchidom̐sa nāḍuno yemo

(||niṁḍu||)
āla nĕduru sūsi yaṁganalam̐ bĕṭṭi paṁpĕ
nīsamugāna kidivo nīramaṇi
mosaboga nīmām̐ṭa mudulagiṁchi rammanĕ
vāsido tāne yīḍagu vachchuno yemo

(||niṁḍu||)
sittamulom̐jiṁtiṁchi seda nannu yīgurudu
hatti nī kimmanĕ nī mohabudevi
mŏttamunam̐ jeyĕttimŏkki nīgu rammanĕ
vŏtti māmūm̐kalo vachchi vunnado yemo

(||niṁḍu||)
kammi tananīrūbulagāgadabusura ṭide
pammi nīgum̐ buttĕṁchĕ nīprāṇeśhvari
simmevu pĕṁjĕmaḍalu śhrī veṁkaḍeśhum̐ḍa nīvu
dŏmmi nīvura mĕkkinadŏyyale ābemo