Nimdina javvanamellaa neesedidi

నిండిన జవ్వనమెల్లా నీచేతిది
Language

(॥పల్లవి॥)
నిండిన జవ్వనమెల్లా నీచేతిది
చండిపెట్టి చూచి నిన్ను జంకించేనా

(॥నిండి॥)
వెలయఁగ నీవు నన్ను వేడుకఁ బెండ్లాడితవి
చలపట్టి నే నిన్ను సాదించేనా
చెలఁగి యెవ్వతొందు చేసినాఁ జేతువుగాక
తలఁపున నీపైఁగాఁతాళించేనా

(॥నిండి॥)
కందున దొల్లె నీవు కంకణము గట్టితివి
యెందుకైనా నేనీతో నెదురాడేనా
విందవై యెవ్వరితో నవ్వినా నవ్వుదుగాక
నిందవేసి నిన్నుఁ గడునేర మెంచేనా

(॥నిండి॥)
కామించి నీవు నన్నుఁ గాఁగిలించి కూడితిని
యేమిసేసినా నదియేఁటి కనేనా
యీమేర శ్రీవేంకటేశ యెట్టున్నా నుందువుగాక
వేమారు నిన్ను నిఁక వెగ్గళించేనా

(||pallavi||)
niṁḍina javvanamĕllā nīsedidi
saṁḍibĕṭṭi sūsi ninnu jaṁkiṁchenā

(||niṁḍi||)
vĕlayam̐ga nīvu nannu veḍugam̐ bĕṁḍlāḍidavi
salabaṭṭi ne ninnu sādiṁchenā
sĕlam̐gi yĕvvadŏṁdu sesinām̐ jeduvugāga
talam̐puna nībaim̐gām̐tāḽiṁchenā

(||niṁḍi||)
kaṁduna dŏllĕ nīvu kaṁkaṇamu gaṭṭidivi
yĕṁdugainā nenīdo nĕdurāḍenā
viṁdavai yĕvvarido navvinā navvudugāga
niṁdavesi ninnum̐ gaḍunera mĕṁchenā

(||niṁḍi||)
kāmiṁchi nīvu nannum̐ gām̐giliṁchi kūḍidini
yemisesinā nadiyem̐ṭi kanenā
yīmera śhrīveṁkaḍeśha yĕṭṭunnā nuṁduvugāga
vemāru ninnu nim̐ka vĕggaḽiṁchenā