నిండెను కళలు సతి నిలువెల్లను
(॥పల్లవి॥)
నిండెను కళలు సతి నిలువెల్లను
పండిన జవ్వన మేరుపరచేటిదెట్లో
(॥॥)
చిత్తము చీఁకటివడె చెలి నిన్నుఁ బాయఁగాను
పొత్తులఁ జుక్కలుగాసెఁ బులకలను
బిత్తరపుమోనానఁ బికములు గూండ్లెక్కె
వుత్తలాన కాంత కొఁక నుదయమౌ టెపుడో
(॥॥)
మెలుఁతకు కొప్పు వీడి మేఘములు ముంచుకొనె
జలజలఁ జెమటలజడి వట్టెను
కలువకన్నులు మంచికారుమెఱుఁగులు మించె
కిలకికి వెలుతురు గనియేది యెపుడో
(॥॥)
పడఁతికి నీరాక పచ్చిగాలియై వీచె
చిడుముడిఁ గోరికలె చిగురించెను
యెడయక శ్రీవేంకటేశ ఇంతిఁ గూడితివి
కడఁగె వసంతవేళ కందువ యిఁకేదో
(||pallavi||)
niṁḍĕnu kaḽalu sadi niluvĕllanu
paṁḍina javvana merubaraseḍidĕṭlo
(||||)
sittamu sīm̐kaḍivaḍĕ sĕli ninnum̐ bāyam̐gānu
pŏttulam̐ jukkalugāsĕm̐ bulagalanu
bittarabumonānam̐ bigamulu gūṁḍlĕkkĕ
vuttalāna kāṁta kŏm̐ka nudayamau ṭĕbuḍo
(||||)
mĕlum̐tagu kŏppu vīḍi meghamulu muṁchugŏnĕ
jalajalam̐ jĕmaḍalajaḍi vaṭṭĕnu
kaluvagannulu maṁchigārumĕṟum̐gulu miṁchĕ
kilagigi vĕluduru ganiyedi yĕbuḍo
(||||)
paḍam̐tigi nīrāga pachchigāliyai vīsĕ
siḍumuḍim̐ gorigalĕ siguriṁchĕnu
yĕḍayaga śhrīveṁkaḍeśha iṁtim̐ gūḍidivi
kaḍam̐gĕ vasaṁtaveḽa kaṁduva yim̐kedo