Nimde ninnisodulanu neemahimale

నిండె నిన్నిచోటులను నీమహిమలే
Language

(॥పల్లవి॥)
నిండె నిన్నిచోటులను నీమహిమలే
అండనే మొక్కేము నీకు నాదినారసింహా

(॥నిండె॥)
కూరిమి యిందిరమీఁద కోపము అసురమీఁద
తారుకాణ నవ్వు దేవతలమీఁదను
ఆరీతి నీకొలు విట్టే అహోబలముమీఁద
నారుకొనె నీనేరుపు నారసింహా

(॥నిండె॥)
కరుణ ప్రహ్లాదమీఁద గన్నులు దిక్కుల మీఁద
సరిచేతులు పేగుల జంధ్యాలమీఁద
గరిమ నీనటనలు ఘనప్రతాపముమీఁద
తిరమాయ నీకోరిక దివ్యనారసింహా

(॥నిండె॥)
శాంతము లోకముమీఁద శౌర్యము శత్రులమీఁద
కాంతులెల్లా తనదివ్యకాయముమీఁద
చింతదీర వినోదము శ్రీవేంకటాద్రిమీఁద
సంతతమై నీకుఁ జెల్లె జయనారసింహా

(||pallavi||)
niṁḍĕ ninnisoḍulanu nīmahimale
aṁḍane mŏkkemu nīgu nādinārasiṁhā

(||niṁḍĕ||)
kūrimi yiṁdiramīm̐da kobamu asuramīm̐da
tārugāṇa navvu devadalamīm̐danu
ārīdi nīgŏlu viṭṭe ahobalamumīm̐da
nārugŏnĕ nīnerubu nārasiṁhā

(||niṁḍĕ||)
karuṇa prahlādamīm̐da gannulu dikkula mīm̐da
sarisedulu pegula jaṁdhyālamīm̐da
garima nīnaḍanalu ghanapradābamumīm̐da
tiramāya nīgoriga divyanārasiṁhā

(||niṁḍĕ||)
śhāṁtamu logamumīm̐da śhauryamu śhatrulamīm̐da
kāṁtulĕllā tanadivyagāyamumīm̐da
siṁtadīra vinodamu śhrīveṁkaḍādrimīm̐da
saṁtadamai nīgum̐ jĕllĕ jayanārasiṁhā