Nimdalu vesevu gaaga nijamaa yidi

నిందలు వేసేవు గాక నిజమా యిది
Language

(॥పల్లవి॥)
నిందలు వేసేవు గాక నిజమా యిది
అందుకేమి వోరి నీకు అయినపాటి చాలదా

(॥నిందలు॥)
చలివలపులు నాపైఁ జల్లే వదేమే వోరి
వెలవెట్ట నీవలపు వేడుక గాదా
పలుమారు నామీఁద పయిఁ జేయి వేయకువే
పిలిచి బిడ్డ నిచ్చితే బిగుతురా వోరి

(॥నిందలు॥)
వావిరిఁ గొప్పు పూవులవాన చూపె నదేమే
పూనక పూచినపూవు పొందులే కాదా
భావించి చన్నుల నిమ్మపండ్ల నొత్తకువే
కావక కాచేకాయల కా పందునా

(॥నిందలు॥)
లతమేనఁ గూడితి వీలాగు లవునే వోరి నీవు
వెతకఁబోయిన తీగె వేవేలు గాదా
రతి శ్రీవేంకటేశుఁడ రచ్చ కెక్కించితి నన్ను
రతిరాజవిభవాలు రచ్చనే కాదా

(||pallavi||)
niṁdalu vesevu gāga nijamā yidi
aṁdugemi vori nīgu ayinabāḍi sāladā

(||niṁdalu||)
salivalabulu nābaim̐ jalle vademe vori
vĕlavĕṭṭa nīvalabu veḍuga gādā
palumāru nāmīm̐da payim̐ jeyi veyaguve
pilisi biḍḍa nichchide bigudurā vori

(||niṁdalu||)
vāvirim̐ gŏppu pūvulavāna sūbĕ nademe
pūnaga pūsinabūvu pŏṁdule kādā
bhāviṁchi sannula nimmabaṁḍla nŏttaguve
kāvaga kāsegāyala kā paṁdunā

(||niṁdalu||)
ladamenam̐ gūḍidi vīlāgu lavune vori nīvu
vĕdagam̐boyina tīgĕ vevelu gādā
radi śhrīveṁkaḍeśhum̐ḍa rachcha kĕkkiṁchidi nannu
radirājavibhavālu rachchane kādā