నిండ నానలు వెట్టకు నీ వంతాను
(॥పల్లవి॥)
నిండ నానలు వెట్టకు నీ వంతాను
అండనితశత్రుఁడ నీయాఱడిఁ జిక్కితిరా
(॥నిండ॥)
కప్పురపు ధూళిదెచ్చి కన్నులనిండాఁ జల్లి
అప్పుడే యాపెఁ గూడితివౌరా నీవు
తప్పులే కూడైనట్టి తాటోటుకాఁడవు నీతో
యిప్పుడు నమ్మి నీ పొందులెట్టు నేఁజేసితిరా
(॥నిండా॥)
చేరెఁడు తట్టుపుణుఁగు చెవులనిండాఁ బోసి
యీరీతి మాటలాడితి వింతితోడను
తీరువడ్డ పెనులోకదిమ్మరివి నీకు నేను
ఆరితేరి నేఁడు నీకు నాలనెట్లైతిరా
(॥నిండా॥)
కౌఁగిట నన్నుబిగించి కళ వట్టించి యాపెతో
చేఁగదేర నవ్వితివి శ్రీ వేంకటేశ
దాఁగిలి ముచ్చిములాడే దాయగాఁడవైన నిన్ను
తోఁగి చూచెట్టు నీరతిదొమ్మికి లోనైతిరా
(||pallavi||)
niṁḍa nānalu vĕṭṭagu nī vaṁtānu
aṁḍanidaśhatrum̐ḍa nīyāṟaḍim̐ jikkidirā
(||niṁḍa||)
kappurabu dhūḽidĕchchi kannulaniṁḍām̐ jalli
appuḍe yābĕm̐ gūḍidivaurā nīvu
tappule kūḍainaṭṭi tāḍoḍugām̐ḍavu nīdo
yippuḍu nammi nī pŏṁdulĕṭṭu nem̐jesidirā
(||niṁḍā||)
serĕm̐ḍu taṭṭubuṇum̐gu sĕvulaniṁḍām̐ bosi
yīrīdi māḍalāḍidi viṁtidoḍanu
tīruvaḍḍa pĕnulogadimmarivi nīgu nenu
ārideri nem̐ḍu nīgu nālanĕṭlaidirā
(||niṁḍā||)
kaum̐giḍa nannubigiṁchi kaḽa vaṭṭiṁchi yābĕdo
sem̐gadera navvidivi śhrī veṁkaḍeśha
dām̐gili muchchimulāḍe dāyagām̐ḍavaina ninnu
tom̐gi sūsĕṭṭu nīradidŏmmigi lonaidirā