Niluvulamedalo nilusunnaam dide

నిలువులమేడలో నిలుచున్నాఁ డిదె
Language

(॥పల్లవి॥)
నిలువులమేడలో నిలుచున్నాఁ డిదె
పిలువవే రమణునిఁ బ్రేమముతోడ

(॥నిలు॥)
చలివేఁడి చేమటల జలక మార్చవే
అలసి వచ్చెఁ బతికి యందుండి
పలుకుల కపురపుబాగా లీవే
తలఁపుల తమకపు దాహము గొనెను

(॥నిలు॥)
తనువులక విరులఁ దగఁ బూజించవే
తనకుఁ దనకె నినుఁ దగిలీని
కనుఁగొన నవ్వుల గందము పూయవే
వెనకటి విరహపువేదన దీర

(॥నిలు॥)
పొరి మోవితేనె బువ్వము దొడుకవే
గరిమ రతుల నాఁకలి గొనెను
మరిగి యితనితో మంతనమాడవే
యిరవుగ శ్రీవేంకటేశుఁడు గూడె

(||pallavi||)
niluvulameḍalo nilusunnām̐ ḍidĕ
piluvave ramaṇunim̐ bremamudoḍa

(||nilu||)
salivem̐ḍi semaḍala jalaga mārsave
alasi vachchĕm̐ badigi yaṁduṁḍi
palugula kaburabubāgā līve
talam̐pula tamagabu dāhamu gŏnĕnu

(||nilu||)
tanuvulaga virulam̐ dagam̐ būjiṁchave
tanagum̐ danagĕ ninum̐ dagilīni
kanum̐gŏna navvula gaṁdamu pūyave
vĕnagaḍi virahabuvedana dīra

(||nilu||)
pŏri movidenĕ buvvamu dŏḍugave
garima radula nām̐kali gŏnĕnu
marigi yidanido maṁtanamāḍave
yiravuga śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ