Niluvudaddamulona needa nalladivo kamti

నిలువుటద్దములోన నీడ నల్లదివో కంటి
Language

(॥పల్లవి॥)
నిలువుటద్దములోన నీడ నల్లదివో కంటి
చలి వాసెఁ దనకేలే సటకాఁడు కృష్ణుఁడు

(॥నిలు॥)
యెఱఁగనట్టె విచ్చేసి యిదె నామలఁగుమీఁదఁ
నొఱిగి వెనకవంక నున్న వాడు వాడు
మఱఙి చెలులు నవ్వితే మానుమని సన్ననేసీ
మఱగు లింకా నేలే మాయకాడు కృష్ణుఁడు

(॥నిలు॥)
మాటలాడక నావద్ద మంచము నాకోటిమీఁద
యేట వుట్టుకొని మమ్ము నెలయించీని
పాటించి లంచము లిచ్చీ పంజరముచిలుకకు
తూఁటరి యీవిద్దెలే దొమ్మికాఁడు కృష్ణుఁడు

(॥నిలు॥)
కందువ పానుపుమీఁద కప్పిననాపచ్చడము
సందు చొచ్చుకొని నన్ను సరిఁ గూడీని
ఇందరిలో నవ్వఁబోతే నింతలో నాచెక్కు నొక్కీ
అందపు శ్రీవేంకటాద్రి నాగడీఁడు కృష్ణుఁడు

(||pallavi||)
niluvuḍaddamulona nīḍa nalladivo kaṁṭi
sali vāsĕm̐ danagele saḍagām̐ḍu kṛṣhṇum̐ḍu

(||nilu||)
yĕṟam̐ganaṭṭĕ vichchesi yidĕ nāmalam̐gumīm̐dam̐
nŏṟigi vĕnagavaṁka nunna vāḍu vāḍu
maṟaṅi sĕlulu navvide mānumani sannanesī
maṟagu liṁkā nele māyagāḍu kṛṣhṇum̐ḍu

(||nilu||)
māḍalāḍaga nāvadda maṁchamu nāgoḍimīm̐da
yeḍa vuṭṭugŏni mammu nĕlayiṁchīni
pāḍiṁchi laṁchamu lichchī paṁjaramusilugagu
tūm̐ṭari yīviddĕle dŏmmigām̐ḍu kṛṣhṇum̐ḍu

(||nilu||)
kaṁduva pānubumīm̐da kappinanābachchaḍamu
saṁdu sŏchchugŏni nannu sarim̐ gūḍīni
iṁdarilo navvam̐bode niṁtalo nāsĕkku nŏkkī
aṁdabu śhrīveṁkaḍādri nāgaḍīm̐ḍu kṛṣhṇum̐ḍu