నిలువు నా నుడిలోన నిజముగా నిపుడు
(॥పల్లవి॥)
నిలువు నా నుడిలోన నిజముగా నిపుడు
తలఁగఁ జెల్లదు నీ దాసుల యెడలను
(॥నిలువు॥)
బలిమి గద్దని మిట్టిపడినఁ బోనియ్య
తల దూర్చుకొని లోన దాఁగినఁ బోనియ్య
పెలుచుఁదనము గీపెట్టినఁ బోనియ్య
చెలఁగి నూరు మోముసేసినఁ బోనియ్య
(॥నిలువు॥)
కొంచెపడి యెంత వేఁడుకొనినాఁ బోనియ్య
పించెపుఁ గైదువ జళిపించినఁ బోనియ్య
వంచించి రాజవైన నవ్వలికిఁ బోనియ్య
మించిన ముసలిపై మీఱినఁ బోనియ్య
(॥నిలువు॥)
పడఁతులలోన భంగపడినఁ బోనియ్య
కడుఁ గరాళించిన కదలి పోనియ్య
విడువ నీ పాదారవిందము నా తలపై
నిడుకొందు వేంకటేశ యేమైనాఁ బోనియ్యా
(||pallavi||)
niluvu nā nuḍilona nijamugā nibuḍu
talam̐gam̐ jĕlladu nī dāsula yĕḍalanu
(||niluvu||)
balimi gaddani miṭṭibaḍinam̐ boniyya
tala dūrsugŏni lona dām̐ginam̐ boniyya
pĕlusum̐danamu gībĕṭṭinam̐ boniyya
sĕlam̐gi nūru momusesinam̐ boniyya
(||niluvu||)
kŏṁchĕbaḍi yĕṁta vem̐ḍugŏninām̐ boniyya
piṁchĕbum̐ gaiduva jaḽibiṁchinam̐ boniyya
vaṁchiṁchi rājavaina navvaligim̐ boniyya
miṁchina musalibai mīṟinam̐ boniyya
(||niluvu||)
paḍam̐tulalona bhaṁgabaḍinam̐ boniyya
kaḍum̐ garāḽiṁchina kadali poniyya
viḍuva nī pādāraviṁdamu nā talabai
niḍugŏṁdu veṁkaḍeśha yemainām̐ boniyyā