నిలుచున్నాఁ డదివో నీ రమణుఁడు
(॥పల్లవి॥)
నిలుచున్నాఁ డదివో నీ రమణుఁడు
తల వంచుకొని యింత తడవు సేయుదురా
(॥నిలు॥)
నీలోనే ములిగేవు నెలఁతలఁ గసరేవు
వేళతో నాతఁ డీడకు విచ్చేయఁడని
లేలే యెక్కడిసుద్ది లేశమంతపనికిఁ గా
మూల నుండే తలుపులు మూసుకొందురా
(॥నిలు॥)
వూరకే యట్టె వుండే వొక మాఁ టానవెట్టేవు
ఆరీతిఁ గొంచేవు వల పాతఁ డనుచు
తేరె నిఁక నేలే నేనే తిద్దే నీయలుకలు
మారుకొని నీనాసంది మఱఁగులు చెల్లునా
(॥నిలు॥)
వాకిలి గొంత దెఱచి వడిఁ దొంగి చూచేవు
జోక నాతనిమనసు చూచే నని
యీకడ శ్రీ వేంకటేశుడింత లో నిన్ను గలసె
యేకడ మీమేలు గోరు కిట్లానే వుండుదు మా
(||pallavi||)
nilusunnām̐ ḍadivo nī ramaṇum̐ḍu
tala vaṁchugŏni yiṁta taḍavu seyudurā
(||nilu||)
nīlone muligevu nĕlam̐talam̐ gasarevu
veḽado nādam̐ ḍīḍagu vichcheyam̐ḍani
lele yĕkkaḍisuddi leśhamaṁtabanigim̐ gā
mūla nuṁḍe talubulu mūsugŏṁdurā
(||nilu||)
vūrage yaṭṭĕ vuṁḍe vŏga mām̐ ṭānavĕṭṭevu
ārīdim̐ gŏṁchevu vala pādam̐ ḍanusu
terĕ nim̐ka nele nene tidde nīyalugalu
mārugŏni nīnāsaṁdi maṟam̐gulu sĕllunā
(||nilu||)
vāgili gŏṁta dĕṟasi vaḍim̐ dŏṁgi sūsevu
joga nādanimanasu sūse nani
yīgaḍa śhrī veṁkaḍeśhuḍiṁta lo ninnu galasĕ
yegaḍa mīmelu goru kiṭlāne vuṁḍudu mā