Nilusunnaam dade neeyedudaa

నిలుచున్నాఁ డదె నీయెదుటా
Language

(॥పల్లవి॥)
నిలుచున్నాఁ డదె నీయెదుటా
నిలువునఁ గాఁగిట నించఁగదే

(॥నిలు॥)
చలమునఁ బతి నిటు సాదించకువే
బలిమి చూపి కడుఁబదరకువే
వెలఁబడ సణఁగులు వెదచల్లకువే
నెలకొని యెమ్మెలు నెరపకువే

(॥నిలు॥)
పంతము లీగతిఁ బచరించకువే
కొంతపుఁజూపులఁ గొసరకువే
దొంతరబీరాలు తొరలించకువే
చెంతల నూరక చెనకకువే

(॥నిలు॥)
యెదుటనుండి బయలీఁదించకువే
పెదవుల గొణఁగుచు బిగియకువే
యిదివో శ్రీవేంకటేశుఁడు నన్నేలె
ఆదన రతుల నీ వలయకువే

(||pallavi||)
nilusunnām̐ ḍadĕ nīyĕduḍā
niluvunam̐ gām̐giḍa niṁcham̐gade

(||nilu||)
salamunam̐ badi niḍu sādiṁchaguve
balimi sūbi kaḍum̐badaraguve
vĕlam̐baḍa saṇam̐gulu vĕdasallaguve
nĕlagŏni yĕmmĕlu nĕrabaguve

(||nilu||)
paṁtamu līgadim̐ basariṁchaguve
kŏṁtabum̐jūbulam̐ gŏsaraguve
dŏṁtarabīrālu tŏraliṁchaguve
sĕṁtala nūraga sĕnagaguve

(||nilu||)
yĕduḍanuṁḍi bayalīm̐diṁchaguve
pĕdavula gŏṇam̐gusu bigiyaguve
yidivo śhrīveṁkaḍeśhum̐ḍu nannelĕ
ādana radula nī valayaguve