నిలుచున్నా డల్లవాఁడె నివ్వెరగుతో
(॥పల్లవి॥)
నిలుచున్నా డల్లవాఁడె నివ్వెరగుతో
తలఁపెల్లఁ జేకొని దగ్గరవే తరుణి
(॥నిలు॥)
తప్పకచూచుచు నట్టె తలఁచు నిన్నాతుమలో
పుప్పొడిగా జుంజుకొనఁబులకించును
వుప్పతిల్లువిరహాన వూరకే గోర గీరు
దప్పిదేరనిమ్మని దగ్గరవే తరుణీ
(॥నిలు॥)
అడుగిడుఁ గాఁకలార అరగంటఁ గెంపు నించు
అడవిలోనే తిరుగు నాసోదాన
కడువలపులు రేఁచు కందువమాయలు సేసి
తడవి నీపతి వాఁడే దగ్గరవే తరుణి
(॥నిలు॥)
సిగ్గులు నిడువఁజూచు చిమ్ముల నెయఁజొచ్చి
నిగ్గుదేర నిన్నుఁ గని నెయ్యముతోడ
అగ్గమై శ్రీవేంకటేశుఁ దంతలోనె నిన్నుఁగూడె
తగ్గక దినము నిట్టె దగ్గరవే తరుణి
(||pallavi||)
nilusunnā ḍallavām̐ḍĕ nivvĕragudo
talam̐pĕllam̐ jegŏni daggarave taruṇi
(||nilu||)
tappagasūsusu naṭṭĕ talam̐su ninnādumalo
puppŏḍigā juṁjugŏnam̐bulagiṁchunu
vuppadilluvirahāna vūrage gora gīru
dappideranimmani daggarave taruṇī
(||nilu||)
aḍugiḍum̐ gām̐kalāra aragaṁṭam̐ gĕṁpu niṁchu
aḍavilone tirugu nāsodāna
kaḍuvalabulu rem̐su kaṁduvamāyalu sesi
taḍavi nībadi vām̐ḍe daggarave taruṇi
(||nilu||)
siggulu niḍuvam̐jūsu simmula nĕyam̐jŏchchi
niggudera ninnum̐ gani nĕyyamudoḍa
aggamai śhrīveṁkaḍeśhum̐ daṁtalonĕ ninnum̐gūḍĕ
taggaga dinamu niṭṭĕ daggarave taruṇi