Nikki yemda daamkanela needagum bonela naagu

నిక్కి యెండ దాఁకనేల నీడకుఁ బోనేల నాకు
Language

(॥పల్లవి॥)
నిక్కి యెండ దాఁకనేల నీడకుఁ బోనేల నాకు
చక్కని నీ కెమ్మోవి చవిగొంటే చాలును

(॥॥)
కందువ నీ మాటలకుఁ గల్లపరచఁగనేల
అందుకొని అవి నిడమననేల
నిందలాడేవారు నీవు నెఱిఁ దగవాడు కోఁగా
విందువలెఁ జెవులార వింటేనాకుఁ జాలును

(॥॥)
గుట్టున నీచేఁతలకుఁ గోపగించుకొననేల
వెట్టఁబడి కమ్మటిని వేఁడుకోనేల
తిట్టులాడి నీవు వారుఁ దీదీపులాడఁగాను
నట్టనడుమ నే వచ్చి నవ్వుటే చాలును

(॥॥)
చేసన్నచేసి నిన్నుఁ జేరఁ బిలువఁగ నేల
దోసాలు నీపై నించి తోయనేల
సేసవెట్టి కడపలో శ్రీ వేంకటేశ నన్ను
వాసిమీరఁ గూడితివి వద్దనుంటేఁ జాలును

(||pallavi||)
nikki yĕṁḍa dām̐kanela nīḍagum̐ bonela nāgu
sakkani nī kĕmmovi savigŏṁṭe sālunu

(||||)
kaṁduva nī māḍalagum̐ gallabarasam̐ganela
aṁdugŏni avi niḍamananela
niṁdalāḍevāru nīvu nĕṟim̐ dagavāḍu kom̐gā
viṁduvalĕm̐ jĕvulāra viṁṭenāgum̐ jālunu

(||||)
guṭṭuna nīsem̐talagum̐ gobagiṁchugŏnanela
vĕṭṭam̐baḍi kammaḍini vem̐ḍugonela
tiṭṭulāḍi nīvu vārum̐ dīdībulāḍam̐gānu
naṭṭanaḍuma ne vachchi navvuḍe sālunu

(||||)
sesannasesi ninnum̐ jeram̐ biluvam̐ga nela
dosālu nībai niṁchi toyanela
sesavĕṭṭi kaḍabalo śhrī veṁkaḍeśha nannu
vāsimīram̐ gūḍidivi vaddanuṁṭem̐ jālunu