నిక్కి చూడ నేరుతుమా నీవే కాక
(॥పల్లవి॥)
నిక్కి చూడ నేరుతుమా నీవే కాక
తక్కక నీ వారము తాలిమి నుండుదుము
(॥నిక్కి॥)
వాముల నవ్వులు నవ్వ వన్నెల మాట లాడ
నే మంతేసి నేరుతుమా నీవే కాక
నేనుపునీసతు లెల్ల నేరిపిరి నీ కింతేసి
చేముదక యిల్లాండ్లము సిగ్గున నుండుదుము
(॥నిక్కి॥)
అతల నేమైనా జేసి యందాలు చేసుకొనను
నీతులు నేరుతుమా నీవే కాక
జాడల నీసతుల లెల్లా జాణఁ జేసి రింతేసి
యీతల నీవారమని యిందుక వుండుదుము
(॥నిక్కి॥)
వాటముగా వలపించి వాసులకు బెనగగ
నీ టింత నేరుతుమా నీవే కాక
గాటమై శ్రీవేంకటేశ గక్కన గూడితి నన్ను
మేఁట్టిట్టపు వారము మెచ్చుక వుండుదుము
(||pallavi||)
nikki sūḍa nerudumā nīve kāga
takkaga nī vāramu tālimi nuṁḍudumu
(||nikki||)
vāmula navvulu navva vannĕla māḍa lāḍa
ne maṁtesi nerudumā nīve kāga
nenubunīsadu lĕlla neribiri nī kiṁtesi
semudaga yillāṁḍlamu sigguna nuṁḍudumu
(||nikki||)
adala nemainā jesi yaṁdālu sesugŏnanu
nīdulu nerudumā nīve kāga
jāḍala nīsadula lĕllā jāṇam̐ jesi riṁtesi
yīdala nīvāramani yiṁduga vuṁḍudumu
(||nikki||)
vāḍamugā valabiṁchi vāsulagu bĕnagaga
nī ṭiṁta nerudumā nīve kāga
gāḍamai śhrīveṁkaḍeśha gakkana gūḍidi nannu
mem̐ṭṭiṭṭabu vāramu mĕchchuga vuṁḍudumu