నిక్కి నిక్కి చూచేవు నీ కేల నీకు
(॥పల్లవి॥)
నిక్కి నిక్కి చూచేవు నీ కేల నీకు
దక్కితిమి తొల్లె మాపైఁ దర వేలా
(॥నిక్కి॥)
కల్లరి వై నీవు రోలఁ గట్టువడుదువు గాక
గొల్లదాన నాతోడి గొడ వేలా
వుల్లసాన నీవు పాలవు ట్లెక్కుదువు గాక
పిల్లఁ గోవిరాగాలఁ బిలువ నేలా
(॥నిక్కి॥)
పిన్నవాఁడ వైననీవు పేయలఁ గాతవు గాక
కన్ను లారిచెటిమాతోఁ గాఁక లేలా
అన్నిటా నిందరిచేతి ఆడికఁ బడుదు కాక
సన్నలఁ జాయల మాతో చల మేలా
(॥నిక్కి॥)
పుక్కిన లోకాలు చూసి బూమెలు సేతువు గాక
కక్కసించి మాతోడి కాఁపిరే లేలా
యెక్కువ శ్రీవెంటటేశ యిర వై కూడితి నన్ను
మిక్కిలి కృష్ణుఁడ నాతో మేకు లేలా
(||pallavi||)
nikki nikki sūsevu nī kela nīgu
dakkidimi tŏllĕ mābaim̐ dara velā
(||nikki||)
kallari vai nīvu rolam̐ gaṭṭuvaḍuduvu gāga
gŏlladāna nādoḍi gŏḍa velā
vullasāna nīvu pālavu ṭlĕkkuduvu gāga
pillam̐ govirāgālam̐ biluva nelā
(||nikki||)
pinnavām̐ḍa vainanīvu peyalam̐ gādavu gāga
kannu lārisĕḍimādom̐ gām̐ka lelā
anniḍā niṁdarisedi āḍigam̐ baḍudu kāga
sannalam̐ jāyala mādo sala melā
(||nikki||)
pukkina logālu sūsi būmĕlu seduvu gāga
kakkasiṁchi mādoḍi kām̐pire lelā
yĕkkuva śhrīvĕṁṭaḍeśha yira vai kūḍidi nannu
mikkili kṛṣhṇum̐ḍa nādo megu lelā