Nikkamugaa navvu vachchee nee momu soosidenu

నిక్కముగా నవ్వు వచ్చీ నీ మోము చూచితేను
Language

(॥పల్లవి॥)
నిక్కముగా నవ్వు వచ్చీ నీ మోము చూచితేను
దిక్కు లెల్లా నిండె మేలు తేవయ్య వీడెము

(॥నిక్కము॥)
గద్దె మీఁదఁ గూచుండి కాంత నండ కుఁ బిలిచి
సుద్దు లెల్లాఁ జెప్పితివి చుట్టమువలెనే
బద్దు లింత నేరకుండితే భ్రమతురా కామినులు
తిద్దనేల నీ గుణము తేవయ్య వీడెము

(॥నిక్కము॥)
చేముట్టి సరులు దిద్ది చెక్కుల జవ్వాది మెత్తి
నేమ మెల్లాఁ జూపితివి నేర్పరివలెనే
గామిడివింత గాకుండితే కరఁగుదురా సతులు
దీమసము నీకుఁ గద్దు తేవయ్య వీడెము

(॥నిక్కము॥)
పరపుపైఁ బవ్వళించి పలుమారుఁ గౌఁగిలించి
యిరవైతి వింటిలోన హితునివలెనే
గరిమ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
తెరమరఁ గింక నేల తేవయ్య వీడెము

(||pallavi||)
nikkamugā navvu vachchī nī momu sūsidenu
dikku lĕllā niṁḍĕ melu tevayya vīḍĕmu

(||nikkamu||)
gaddĕ mīm̐dam̐ gūsuṁḍi kāṁta naṁḍa kum̐ bilisi
suddu lĕllām̐ jĕppidivi suṭṭamuvalĕne
baddu liṁta neraguṁḍide bhramadurā kāminulu
tiddanela nī guṇamu tevayya vīḍĕmu

(||nikkamu||)
semuṭṭi sarulu diddi sĕkkula javvādi mĕtti
nema mĕllām̐ jūbidivi nerbarivalĕne
gāmiḍiviṁta gāguṁḍide karam̐gudurā sadulu
dīmasamu nīgum̐ gaddu tevayya vīḍĕmu

(||nikkamu||)
parabubaim̐ bavvaḽiṁchi palumārum̐ gaum̐giliṁchi
yiravaidi viṁṭilona hidunivalĕne
garima śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
tĕramaram̐ giṁka nela tevayya vīḍĕmu