నిక్కము నేఁడు మా పొందు నీకు వలెనా
(॥పల్లవి॥)
నిక్కము నేఁడు మా పొందు నీకు వలెనా
చక్కని విభుఁడ యింత చవి వుట్టీనా
(॥నిక్కము॥)
మనసు దెలసి నాతో మాట లాడే విప్పు డిట్టే
తనిసి నేఁ డైన నీచిత్తము వచ్చెనా
చెనకి నామీఁదఁ దెచ్చి చేయి వేసే వప్పిటిని
వెనకముందరి బుద్ది విచారించుకొంటావా
(॥నిక్కము॥)
నయగారమును మాతో నవ్వఁ జూచే విప్పు డిట్టే
జయ మైన సిగ్గు దేరి చలి వాసెనా
ప్రియపడి నన్నుఁ గడు పేరుకొని పిలిచేవు
క్రియతో నీ కింతపని కిమ్ములఁ గలిగెనా
(॥నిక్కము॥)
చొక్కుచు నా మోముదిక్కు చూచేవు సారె సారె
పుక్కటై నీలోని వలపులు రేగెనా
యిక్కు వంటి శ్రీవెంకటేశ నన్ను గూడితివి
దిక్కుల నీగుణములు తిద్దుకొంటివా
(||pallavi||)
nikkamu nem̐ḍu mā pŏṁdu nīgu valĕnā
sakkani vibhum̐ḍa yiṁta savi vuṭṭīnā
(||nikkamu||)
manasu dĕlasi nādo māḍa lāḍe vippu ḍiṭṭe
tanisi nem̐ ḍaina nīsittamu vachchĕnā
sĕnagi nāmīm̐dam̐ dĕchchi seyi vese vappiḍini
vĕnagamuṁdari buddi visāriṁchugŏṁṭāvā
(||nikkamu||)
nayagāramunu mādo navvam̐ jūse vippu ḍiṭṭe
jaya maina siggu deri sali vāsĕnā
priyabaḍi nannum̐ gaḍu perugŏni pilisevu
kriyado nī kiṁtabani kimmulam̐ galigĕnā
(||nikkamu||)
sŏkkusu nā momudikku sūsevu sārĕ sārĕ
pukkaḍai nīloni valabulu regĕnā
yikku vaṁṭi śhrīvĕṁkaḍeśha nannu gūḍidivi
dikkula nīguṇamulu tiddugŏṁṭivā