నిక్కము నా బదుకెల్ల నీచేతిది
(॥పల్లవి॥)
నిక్కము నా బదుకెల్ల నీచేతిది
మక్కువలు నెరవేరె మఱి యేఁటిమాటలు
(॥నిక్క॥)
తలఁపు నాలోనిది తగవు నీచేతిది
వలపు పదారేండ్లవయసుది
నిలువెల్లఁ జెమరించె నీవొద్దనుందాన
చెలులింకనేమని చెప్పేరు బుద్ధులు
(॥నిక్క॥)
సిగ్గులు నామేనివి చెనకు నీగోళ్ళది
తగ్గనియాసలు మనతమకమువి
వెగ్గళించెఁ బులకలు వేడుకలు గనమాయ
కగ్గుదేర నేమని కానుకలిచ్చేను
(॥నిక్క॥)
చన్నులు నావురమువి చనవు నీకౌఁగిటిది
పన్నిన పరవశాలు భావరతివి
అన్నిటా శ్రీవెంకటేశ అట్టె నన్నుఁగూడితివి
యెన్నిలేవు నీగుణాలు యెదురేది నీకు
(||pallavi||)
nikkamu nā badugĕlla nīsedidi
makkuvalu nĕraverĕ maṟi yem̐ṭimāḍalu
(||nikka||)
talam̐pu nālonidi tagavu nīsedidi
valabu padāreṁḍlavayasudi
niluvĕllam̐ jĕmariṁchĕ nīvŏddanuṁdāna
sĕluliṁkanemani sĕpperu buddhulu
(||nikka||)
siggulu nāmenivi sĕnagu nīgoḽḽadi
tagganiyāsalu manadamagamuvi
vĕggaḽiṁchĕm̐ bulagalu veḍugalu ganamāya
kaggudera nemani kānugalichchenu
(||nikka||)
sannulu nāvuramuvi sanavu nīgaum̐giḍidi
pannina paravaśhālu bhāvaradivi
anniḍā śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐gūḍidivi
yĕnnilevu nīguṇālu yĕduredi nīgu