Nikkamu galladoda nija mova dannamaada

నిక్కము గల్లతోడ నిజ మోవ దన్నమాట
Language

(॥పల్లవి॥)
నిక్కము గల్లతోడ నిజ మోవ దన్నమాట
యిక్కడనే చెల్లఁ బెట్టె నిఁక నేఁటికే

(॥నిక్కము॥)
తననోరే ఘనమే తగవరిఁ దానే
అనువుగా నన్ను మాటలాడ నీఁడే
అనక తొలుతే మీతో నాన లెన్నియైనాఁ బెట్టి
కినిసి నే నితనితో గెలువఁగఁ గలనా

(॥నిక్కము॥)
జగడగాఁడూఁ దానే సాకిరిమానిసీఁ దానే
పగటున నే నాతని ప్రతివాదినా
మగువలాల మీవద్ద మంచి వాఁడై యున్నాఁడు
బిగిసి నే నితనితో పెనఁగఁ గలనా

(॥నిక్కము॥)
సేసినచేఁతాఁ దనదే చెల్లుబడీఁ దనదే
దోసము నా కోప మిఁక తుద కెక్కేనా
ఆసల శ్రీవేంకటేశుఁ డంకెల నన్నుఁ గూడె
వేసాల నితని వోజ విడిపించఁ గలనా

(||pallavi||)
nikkamu galladoḍa nija mova dannamāḍa
yikkaḍane sĕllam̐ bĕṭṭĕ nim̐ka nem̐ṭige

(||nikkamu||)
tananore ghaname tagavarim̐ dāne
anuvugā nannu māḍalāḍa nīm̐ḍe
anaga tŏlude mīdo nāna lĕnniyainām̐ bĕṭṭi
kinisi ne nidanido gĕluvam̐gam̐ galanā

(||nikkamu||)
jagaḍagām̐ḍūm̐ dāne sāgirimānisīm̐ dāne
pagaḍuna ne nādani pradivādinā
maguvalāla mīvadda maṁchi vām̐ḍai yunnām̐ḍu
bigisi ne nidanido pĕnam̐gam̐ galanā

(||nikkamu||)
sesinasem̐tām̐ danade sĕllubaḍīm̐ danade
dosamu nā koba mim̐ka tuda kĕkkenā
āsala śhrīveṁkaḍeśhum̐ ḍaṁkĕla nannum̐ gūḍĕ
vesāla nidani voja viḍibiṁcham̐ galanā