Nikkamu bomkulu remdoo neeve kaava(vaa?)

నిక్కము బొంకులు రెండూ నీవే కావ(వా?)
Language

(॥పల్లవి॥)
నిక్కము బొంకులు రెండూ నీవే కావ(వా?)
నిక్కి చూచేవప్పటిని నీవే కావా

(॥నిక్క॥)
నారుకొని యాతఁడు నాతో మాటలాడకుండ
నేరిపితి బుద్దులు నీవే కావ
దూరితేను నీవాతనిఁ దోడుక పొమ్మనేవు
నీరువంకతుంగవైతి నీవే కావా

(॥నిక్క॥)
కమ్మి యాతనివద్దను కాచుకుండి యరచేతి
నిమ్మపండవైతివి నీవే కావ
వుమ్మడి వాదడిచితే వూరకే మొకమోడి
నెమ్మిచాయకు వచ్చేవు నీవే కావా

(॥నిక్క॥)
కావించి యాతఁడు నేను కాఁగిలించుకుండఁగాను
నీవద్దికి బిలిచేవు నీవే కావ
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి యిద్దరిఁ గూడఁగ
నీవే నేననేదానవు నీవే కావా

(||pallavi||)
nikkamu bŏṁkulu rĕṁḍū nīve kāva(vā?)
nikki sūsevappaḍini nīve kāvā

(||nikka||)
nārugŏni yādam̐ḍu nādo māḍalāḍaguṁḍa
neribidi buddulu nīve kāva
dūridenu nīvādanim̐ doḍuga pŏmmanevu
nīruvaṁkaduṁgavaidi nīve kāvā

(||nikka||)
kammi yādanivaddanu kāsuguṁḍi yarasedi
nimmabaṁḍavaidivi nīve kāva
vummaḍi vādaḍiside vūrage mŏgamoḍi
nĕmmisāyagu vachchevu nīve kāvā

(||nikka||)
kāviṁchi yādam̐ḍu nenu kām̐giliṁchuguṁḍam̐gānu
nīvaddigi bilisevu nīve kāva
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri yiddarim̐ gūḍam̐ga
nīve nenanedānavu nīve kāvā