Nikkamamma yashoda niyyaana

నిక్కమమ్మ యశోద నియ్యాన
Language

(॥పల్లవి॥)
నిక్కమమ్మ యశోద నియ్యాన
అక్కడ నెవ్వరోకాక అటువంటివాఁడా

(॥నిక్కి॥)
వీఁడుగదె బాలుఁడు వెన్నలు దొంగలీ నేఁడు
కాఁడువో అదేమోసి గబ్బిగొల్లెత
చూడఁగదె నీవు సోయగపు చేతిజిడ్డు
ఆడేవు కల్లలేకాక అటువంటివాఁడా

(॥నిక్కి॥)
చిక్కెఁగదె మీవాఁడే చేరి పెరుగుదొంగ
పొక్కాలదేమోపి బొంకుగొల్లెత
పుక్కిట నిదిగదె పొంగినట్టిమీఁగడలు
అక్కటా నీభ్రమలింతే అటువంటివాఁడా

(॥నిక్కి॥)
యిదివో శ్రీవేంకటేశుఁ డింతేసి సేసినాఁడు
పదమే నీవేమనేవు బద్దుగొల్లెత
అదివో నీమాఁటలైతే అన్నియుఁ జెల్లెనమ్మ
అదనాయ మీకు నాడ నటువంటివాఁడా

(||pallavi||)
nikkamamma yaśhoda niyyāna
akkaḍa nĕvvarogāga aḍuvaṁṭivām̐ḍā

(||nikki||)
vīm̐ḍugadĕ bālum̐ḍu vĕnnalu dŏṁgalī nem̐ḍu
kām̐ḍuvo ademosi gabbigŏllĕda
sūḍam̐gadĕ nīvu soyagabu sedijiḍḍu
āḍevu kallalegāga aḍuvaṁṭivām̐ḍā

(||nikki||)
sikkĕm̐gadĕ mīvām̐ḍe seri pĕrugudŏṁga
pŏkkālademobi bŏṁkugŏllĕda
pukkiḍa nidigadĕ pŏṁginaṭṭimīm̐gaḍalu
akkaḍā nībhramaliṁte aḍuvaṁṭivām̐ḍā

(||nikki||)
yidivo śhrīveṁkaḍeśhum̐ ḍiṁtesi sesinām̐ḍu
padame nīvemanevu baddugŏllĕda
adivo nīmām̐ṭalaide anniyum̐ jĕllĕnamma
adanāya mīgu nāḍa naḍuvaṁṭivām̐ḍā