Nikkamaina maa badugu nee sedide

నిక్కమైన మా బతుకు నీ చేతిదే
Language

(॥పల్లవి॥)
నిక్కమైన మా బతుకు నీ చేతిదే
యెక్కడి కెక్కడ మమ్మునేల కొసరేవు

(॥నిక్క॥)
యిందు రమ్మని పిలువ యేలుకొన్న దాననా
మందటలాడి పెనఁగ మంకుదాననా
విందులు చెప్పఁగ నీకు వియ్యాల దాననా
యెందుదాన మమ్ము నీవు యేలకొసరేవు

(॥నిక్క॥)
అండఁ గాచుకుండేనంటే అద్దికపుదాననా
దుండగానఁ బట్టి తియ్య దొమ్మిదాననా
బండుగా నవ్వులు నవ్వ పల్లదపుదాననా
యెండలెల్లాఁ బాపితివి యేల కొసరేవు

(॥నిక్క॥)
సారె నీకు బుద్ది చెప్ప చదివించే దాననా
మేరలు మీరఁగ నీతో మేనదాననా
ఆరితేరి శ్రీ వేంకటాధిప నన్నుఁ గూడితే(తి)
యీరీతి మొక్కితి నన్ను యేల కొసరేవు

(||pallavi||)
nikkamaina mā badugu nī sedide
yĕkkaḍi kĕkkaḍa mammunela kŏsarevu

(||nikka||)
yiṁdu rammani piluva yelugŏnna dānanā
maṁdaḍalāḍi pĕnam̐ga maṁkudānanā
viṁdulu sĕppam̐ga nīgu viyyāla dānanā
yĕṁdudāna mammu nīvu yelagŏsarevu

(||nikka||)
aṁḍam̐ gāsuguṁḍenaṁṭe addigabudānanā
duṁḍagānam̐ baṭṭi tiyya dŏmmidānanā
baṁḍugā navvulu navva palladabudānanā
yĕṁḍalĕllām̐ bābidivi yela kŏsarevu

(||nikka||)
sārĕ nīgu buddi sĕppa sadiviṁche dānanā
meralu mīram̐ga nīdo menadānanā
ārideri śhrī veṁkaḍādhiba nannum̐ gūḍide(ti)
yīrīdi mŏkkidi nannu yela kŏsarevu