Nijamunum gallayu neemenane vunnadi

నిజమునుఁ గల్లయు నీమేననే వున్నది
Language

(॥పల్లవి॥)
నిజమునుఁ గల్లయు నీమేననే వున్నది
బుజము చూపుమా నీ బొంకు లిఁక నేఁటికి

(॥నిజ॥)
సాదించేవు మాటల చలపాదితనమేల
లేదా నీకాపెపొందు లేలే నీవు
వాదించే వప్పటి నాతో వనితలెల్లా వినఁగా
సాదవానీవేమైనా సట లింకా నేఁటికి

(॥నిజ॥)
ఆడేవు నీయాచారాలు అంత దోసాలేఁటికి
చూడవా నీ వాపెదిక్కు సూటిగా నేఁడు
వోడక తగవాడేవు వూరివా రెరిఁగినపనికి
జాడ దప్పనివాడవా సట లింకా నేఁటికి

(॥నిజ॥)
కలకల నవ్వేవు గుట్టువాయితనమేల
వలవవా ఆపెకు వంతుల నీవు
యెలమి శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
చలివాసితి విన్ని టాను సట లింకా నేఁటికి

(||pallavi||)
nijamunum̐ gallayu nīmenane vunnadi
bujamu sūbumā nī bŏṁku lim̐ka nem̐ṭigi

(||nija||)
sādiṁchevu māḍala salabādidanamela
ledā nīgābĕbŏṁdu lele nīvu
vādiṁche vappaḍi nādo vanidalĕllā vinam̐gā
sādavānīvemainā saḍa liṁkā nem̐ṭigi

(||nija||)
āḍevu nīyāsārālu aṁta dosālem̐ṭigi
sūḍavā nī vābĕdikku sūḍigā nem̐ḍu
voḍaga tagavāḍevu vūrivā rĕrim̐ginabanigi
jāḍa dappanivāḍavā saḍa liṁkā nem̐ṭigi

(||nija||)
kalagala navvevu guṭṭuvāyidanamela
valavavā ābĕgu vaṁtula nīvu
yĕlami śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
salivāsidi vinni ṭānu saḍa liṁkā nem̐ṭigi