Nijamule pasarimchu nemmadi ninnaallum daanu

నిజములే పచరించు నెమ్మది నిన్నాళ్లుఁ దాను
Language

(॥పల్లవి॥)
నిజములే పచరించు నెమ్మది నిన్నాళ్లుఁ దాను
భజన నన్నియు నేఁడు బట్టబయలాయనే

(॥నిజ॥)
పొద్దు వోయినాఁదాఁకా పొలఁతితో మాటలాడి
నిద్దిరించి వుండినది నే నెఱఁగనే
సుద్దులు చెప్పేనంటా చూచి మేలుకొలిపితే
ఇద్దరు నన్నుఁ జూచి తామేల సిగ్గుపడేరే

(॥నిజ॥)
చిడుముడి నిందాఁకా చెలికి సింగారించి
బడలి తానున్నదా భావించనే
వడిఁ దలుపు దెఱచి వద్దికి నే వచ్చితేను
తడవి తమలోఁదాము తలలువంచేరే

(॥నిజ॥)
యింపుల శ్రీవేంకటేశుఁ డీవనిత రతిఁ గూడి
సొంపుమొగచాటైనది చూడనైతినే
జంపులేక నే వచ్చి సరిఁగాఁగిలించుకొంటే
ముంపులఁ జూచి తామేల మొనసి నవ్వేరే

(||pallavi||)
nijamule pasariṁchu nĕmmadi ninnāḽlum̐ dānu
bhajana nanniyu nem̐ḍu baṭṭabayalāyane

(||nija||)
pŏddu voyinām̐dām̐kā pŏlam̐tido māḍalāḍi
niddiriṁchi vuṁḍinadi ne nĕṟam̐gane
suddulu sĕppenaṁṭā sūsi melugŏlibide
iddaru nannum̐ jūsi tāmela siggubaḍere

(||nija||)
siḍumuḍi niṁdām̐kā sĕligi siṁgāriṁchi
baḍali tānunnadā bhāviṁchane
vaḍim̐ dalubu dĕṟasi vaddigi ne vachchidenu
taḍavi tamalom̐dāmu talaluvaṁchere

(||nija||)
yiṁpula śhrīveṁkaḍeśhum̐ ḍīvanida radim̐ gūḍi
sŏṁpumŏgasāḍainadi sūḍanaidine
jaṁpulega ne vachchi sarim̐gām̐giliṁchugŏṁṭe
muṁpulam̐ jūsi tāmela mŏnasi navvere