నిజము చెప్పఁబోతే నెలఁతలు నవ్వేరు
(॥పల్లవి॥)
నిజము చెప్పఁబోతే నెలఁతలు నవ్వేరు
భజన నెందరికని బాస లిచ్చేవయ్యా
(॥॥)
చెప్పరాదు చెలులు పదారువేలు
నెప్పున నీవాడుకొంటే నిజమందురా
పిప్పిగట్ట నాసలేల పదవు లెండీఁ జాలు
కప్పుర మిచ్చేఁగానీ కాఁగిలించవయ్యా
(॥॥)
నమ్మిరి గొల్లెతలు నీనయగారితనములు
కమ్మరాఁజేయఁగఁబోతే గై కొందురా
చిమ్మి చెక్కునొక్కనేల చేతులు నొచ్చీఁ జాలు
వుమ్మడి గుచాల నొత్తే నొద్దికి రావయ్యా
(॥॥)
కంటిమి నీనేరువులు కాగిటిలోనే నేడు
అంటి కూడితే భ్రమయక వుందురా
వొంటినే శ్రీవేంకటేశ వొడబరచి పొందితి-
వింటిలోఁ బానువు మీది కిక రావయ్యా
(||pallavi||)
nijamu sĕppam̐bode nĕlam̐talu navveru
bhajana nĕṁdarigani bāsa lichchevayyā
(||||)
sĕpparādu sĕlulu padāruvelu
nĕppuna nīvāḍugŏṁṭe nijamaṁdurā
pippigaṭṭa nāsalela padavu lĕṁḍīm̐ jālu
kappura michchem̐gānī kām̐giliṁchavayyā
(||||)
nammiri gŏllĕdalu nīnayagāridanamulu
kammarām̐jeyam̐gam̐bode gai kŏṁdurā
simmi sĕkkunŏkkanela sedulu nŏchchīm̐ jālu
vummaḍi gusāla nŏtte nŏddigi rāvayyā
(||||)
kaṁṭimi nīneruvulu kāgiḍilone neḍu
aṁṭi kūḍide bhramayaga vuṁdurā
vŏṁṭine śhrīveṁkaḍeśha vŏḍabarasi pŏṁdidi-
viṁṭilom̐ bānuvu mīdi kiga rāvayyā