Nijamu loluganela neegu neege maadoda

నిజము లొలుకనేల నీకు నీకే మాతోడ
Language

(॥పల్లవి॥)
నిజము లొలుకనేల నీకు నీకే మాతోడ
గజిబిజి చేఁతలనే గయ్యాళించే విపుడు

(॥నిజ॥)
కపటము లేక మదిఁ గాఁతాళము వొడమదు
నెపము గలితేఁగాని నిందించరాదు
కపురుగ నీ యందె కంటిమి యీరెండు నేఁడు
వుపమ లిందరివలె వూరకుండ విపుడు

(॥నిజ॥)
కన్నుసన్నలు సేయక కందువ నాస పుట్టదు
వెన్నెలు వెట్టితేఁగాని వెంగెము గాదు
ఇన్నియు నందరికి నీ విచ్చిన విద్యలు నేఁడు
విన్న కన్నచోట వెల్లావిరి సేసే విపుడు

(॥నిజ॥)
దగ్గరి కూచున్నఁగాని తమకములు రేఁగవు
సిగ్గు విడిచినఁగాని చెనకరాదు
యెగ్గుదీర శ్రీ వేంకటేశ నన్నుఁగూడితివి
వెగ్గళించి రతులలో వెరగందే విపుడు

(||pallavi||)
nijamu lŏluganela nīgu nīge mādoḍa
gajibiji sem̐talane gayyāḽiṁche vibuḍu

(||nija||)
kabaḍamu lega madim̐ gām̐tāḽamu vŏḍamadu
nĕbamu galidem̐gāni niṁdiṁcharādu
kaburuga nī yaṁdĕ kaṁṭimi yīrĕṁḍu nem̐ḍu
vubama liṁdarivalĕ vūraguṁḍa vibuḍu

(||nija||)
kannusannalu seyaga kaṁduva nāsa puṭṭadu
vĕnnĕlu vĕṭṭidem̐gāni vĕṁgĕmu gādu
inniyu naṁdarigi nī vichchina vidyalu nem̐ḍu
vinna kannasoḍa vĕllāviri sese vibuḍu

(||nija||)
daggari kūsunnam̐gāni tamagamulu rem̐gavu
siggu viḍisinam̐gāni sĕnagarādu
yĕggudīra śhrī veṁkaḍeśha nannum̐gūḍidivi
vĕggaḽiṁchi radulalo vĕragaṁde vibuḍu