నిజము దెలియని మానేరమే కాక
(॥పల్లవి॥)
నిజము దెలియని మానేరమే కాక
భజన నీవు చేపట్టినందుఁ గడమా
(॥నిజ॥)
అంచలఁ బరుసము లోహపుఁ గాళికలనెల్ల
యెంచీనా పసిఁడి గావించుఁ గాక
నించిన నిన్నాతుమఁ జింతించువారి పాతకాలు
మించనిచ్చేవా మేలే మెరయింతుగాక
(॥నిజ॥)
నలువంకరకిరణాలు మేలుగీడని
తలఁగీనా యిన్నిటిలోఁ దానే కాక
యిల నీదాసుఁడు జాతి నెవ్వఁడైనా నీకృపఁ
జెలఁగి పావనుఁ జేసి చేకొనుఁ గాక
(॥నిజ॥)
పూనిన దిక్కులగాలి పొందుగ నీడాడని
మానీనా లోకమెల్లా మలయుఁగాక
మానక శ్రీవేంకటేశ మహిలో నీదాసులుండే-
దేనెలవైనా నీకిరవేకాదా
(||pallavi||)
nijamu dĕliyani mānerame kāga
bhajana nīvu sebaṭṭinaṁdum̐ gaḍamā
(||nija||)
aṁchalam̐ barusamu lohabum̐ gāḽigalanĕlla
yĕṁchīnā pasim̐ḍi gāviṁchum̐ gāga
niṁchina ninnādumam̐ jiṁtiṁchuvāri pādagālu
miṁchanichchevā mele mĕrayiṁtugāga
(||nija||)
naluvaṁkaragiraṇālu melugīḍani
talam̐gīnā yinniḍilom̐ dāne kāga
yila nīdāsum̐ḍu jādi nĕvvam̐ḍainā nīkṛpam̐
jĕlam̐gi pāvanum̐ jesi segŏnum̐ gāga
(||nija||)
pūnina dikkulagāli pŏṁduga nīḍāḍani
mānīnā logamĕllā malayum̐gāga
mānaga śhrīveṁkaḍeśha mahilo nīdāsuluṁḍe-
denĕlavainā nīgiravegādā