Nijame yaadudu gaaga nee kela yee verabu

నిజమే యాడుదు గాక నీ కేల యీ వెరపు
Language

(॥పల్లవి॥)
నిజమే యాడుదు గాక నీ కేల యీ వెరపు
గజిబిజి సేసి నిన్ను గాసిఁ బెట్టేనా

(॥నిజమే॥)
మాఁట లాడుటే గురుతు మంచముపై నాపె నీవు
నాటినకూరిమి మించునవ్వులతోడ
యేఁటికి నాతో బొంకే వేసుద్ది నెరఁగ నంటా
ఆఁటదాన నిన్ను నే నే మైనాఁ జేసేనా

(॥నిజమే॥)
చేయి వట్టుటే గురుతు సిగ్గుపడి యున్నచెలి
చాయకుఁ దీసీ నది పూఁజప్పరములో
మాయ లేల నెరపేవు మగువ నింతే నేను
దాయవలె నీతోడఁ దగఁ బోరేనా

(॥నిజమే॥)
చెక్కు నొక్కుటే గురుతు చెలి నీవు మేడమీఁద
నెక్కడి యానలు నాతో నేల పెట్టేవు
యిక్కడ శ్రీవెంకటేశ యేలితివి నన్ను నేఁడు
పక్కన లే కున్న నిన్ను బలిమి సేసేనా

(||pallavi||)
nijame yāḍudu gāga nī kela yī vĕrabu
gajibiji sesi ninnu gāsim̐ bĕṭṭenā

(||nijame||)
mām̐ṭa lāḍuḍe gurudu maṁchamubai nābĕ nīvu
nāḍinagūrimi miṁchunavvuladoḍa
yem̐ṭigi nādo bŏṁke vesuddi nĕram̐ga naṁṭā
ām̐ṭadāna ninnu ne ne mainām̐ jesenā

(||nijame||)
seyi vaṭṭuḍe gurudu siggubaḍi yunnasĕli
sāyagum̐ dīsī nadi pūm̐japparamulo
māya lela nĕrabevu maguva niṁte nenu
dāyavalĕ nīdoḍam̐ dagam̐ borenā

(||nijame||)
sĕkku nŏkkuḍe gurudu sĕli nīvu meḍamīm̐da
nĕkkaḍi yānalu nādo nela pĕṭṭevu
yikkaḍa śhrīvĕṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
pakkana le kunna ninnu balimi sesenā