నిజమరివి నీవని నే నుండుదును
(॥పల్లవి॥)
నిజమరివి నీవని నే నుండుదును
గజరులు చెలి యదే కదిసీ నిన్నును
(॥నిజ॥)
పగటులనడపులఁ బకపకనగుచును
మగువ నీయెదుటను మలసీని
తగులు గలుగఁబోలు తరుణుల నొల్లనని
పొగరుల నాతో బొంకుదువు
(॥నిజ॥)
పుక్కిటివిడెముతోఁ బొరిఁ గన్నులార్చుచు
చక్కనిమగువ నిన్ను జరసీని
వొక్కటి నీతోఁ గాఁబోలు వొగి నీవాఁడ నేయంటా
చక్కఁగ నేడలేనిబాసలు సేతువు
(॥నిజ॥)
నిలువుఁజెమట గార నీతో సరసమాడినీ
కలికి నీకు నసలు గాఁబోలును
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
యిలఁ గొంతవడి భ్రమయించనేల నీవు
(||pallavi||)
nijamarivi nīvani ne nuṁḍudunu
gajarulu sĕli yade kadisī ninnunu
(||nija||)
pagaḍulanaḍabulam̐ bagabaganagusunu
maguva nīyĕduḍanu malasīni
tagulu galugam̐bolu taruṇula nŏllanani
pŏgarula nādo bŏṁkuduvu
(||nija||)
pukkiḍiviḍĕmudom̐ bŏrim̐ gannulārsusu
sakkanimaguva ninnu jarasīni
vŏkkaḍi nīdom̐ gām̐bolu vŏgi nīvām̐ḍa neyaṁṭā
sakkam̐ga neḍalenibāsalu seduvu
(||nija||)
niluvum̐jĕmaḍa gāra nīdo sarasamāḍinī
kaligi nīgu nasalu gām̐bolunu
yĕlami śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
yilam̐ gŏṁtavaḍi bhramayiṁchanela nīvu