నిజమరి నంటా వచ్చి నిలుచున్నా డాతఁడు
(॥పల్లవి॥)
నిజమరి నంటా వచ్చి నిలుచున్నా డాతఁడు
గుజగుజ లేలాతని గుణము చూచుకోవే
(॥నిజ॥)
తప్పక యేమి చూచేవే తరుణీ యాతని మోము
కప్పిన గుఱుతేమైనా గంటివా నీవు
నెప్పున నాతనినెల నిలిచి రమ్మనవే
అప్పుడే యతడెందై నా నంటువడి వచ్చెనా
(॥నిజ॥)
నవ్వులేమి నవ్వేవే నాయకుని మాటలకు
రవ్వలుగా నందేమైనా రాగిదేరెనా
పువ్వులాతడిచ్చినవి పుచ్చుకొన వదియేమే
అవ్వల నొకరిచేతి వందుకొని వచ్చెనా
(॥నిజ ॥)
చెక్కులేమి నొక్కేవే శ్రీవేంకటేశ్వరుని
మిక్కుటపు రతులను మించి వచ్చెనా
యిక్కువగా గూడినందు కేల వెరగువడేవే
నిక్కముగా నందునుండి నేర్చుకొని వచ్చెనా
(||pallavi||)
nijamari naṁṭā vachchi nilusunnā ḍādam̐ḍu
gujaguja lelādani guṇamu sūsugove
(||nija||)
tappaga yemi sūseve taruṇī yādani momu
kappina guṟudemainā gaṁṭivā nīvu
nĕppuna nādaninĕla nilisi rammanave
appuḍe yadaḍĕṁdai nā naṁṭuvaḍi vachchĕnā
(||nija||)
navvulemi navveve nāyaguni māḍalagu
ravvalugā naṁdemainā rāgiderĕnā
puvvulādaḍichchinavi puchchugŏna vadiyeme
avvala nŏgarisedi vaṁdugŏni vachchĕnā
(||nija ||)
sĕkkulemi nŏkkeve śhrīveṁkaḍeśhvaruni
mikkuḍabu radulanu miṁchi vachchĕnā
yikkuvagā gūḍinaṁdu kela vĕraguvaḍeve
nikkamugā naṁdunuṁḍi nersugŏni vachchĕnā